ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భద్రతా వలయాన్ని పటిష్టం చేయడంతో, ఆమె బహిరంగ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం తరుచుగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. 2019లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే కోపంతో ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు, 2016లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై కొందరు నల్ల సిరా చల్లారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-cm-rekha-gupta-39-199460.html
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.