Publish Date:Nov 11, 2025
ఢిల్లీలో చాందినీ చౌక్, లాల్ ఖిలా, నయి దిల్లి రైల్వే స్టేషన్ కు అతి దగ్గర గా , పార్లమెంట్ కు కూడా పెద్దగా దూరం లేని ప్రాంతం లో కారు లో భారీ పేలుడు పదార్ధాలతో కూడిన ఆత్మహుతి దాడి జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే తేలిందని చెబుతున్నాయి.
ఇక బీహార్ లో అత్యంత కీలక మైన రెండో, చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ రెంటికీ లింక్ లేదు.. డిల్లి లో జరిగిన పేలుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద కుదుపునకు లోను చేసింది. పహాల్ గావ్ ఘటన జరిగిన తరువాత.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు అత్యంత అప్రమత్తత తో పనిచేస్తున్నాయి అన్నది వాస్తవం. అయినా వాటి నిఘా నీడ ను తప్పించుకొని డిల్లి లో కొన్ని కిలోల పేలుడు మెటీరియల్ ను తెచ్చి పేల్చడాన్ని నిఘావైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే బీహార్ ఎన్నికల పై ఈ బ్లాస్ట్ ప్రభావం ఉంటుందా? అన్నదో ప్రశ్న. సోమవారం రాత్రి 7.30 నిముషాలకు జరిగిన బ్లాస్ట్ దేశం లో నిముషాల్లో పాకి పోయింది.. దీనికంటే ముందు ఒక విషయం చెప్పుకోవలసి ఉంటుంది. 1991 లో రాజీవ్ గాంధీ పై మానవ బాంబుదాడి జరిగింది.. ఆ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు దేశం లో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి . దాదాపుగా కాంగ్రెస్ కు స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని ఎన్నికలు అవి. రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఫేజ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. రాజీవ్ హత్యకు ముందు జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ కు చాలా చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు ప్రజెంట్ బీహార్ ఎన్నికలకు వద్దాం.. తెల్లారి రెండోది చివరిది అయిన ఎన్నికల ఫేజ్.. మొదటి ఫేజ్ లో ఎన్ డీ ఏ కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనేది పబ్లిక్ టాక్ గా ఉంది.. రెండో ఫేజ్ పై దాని ప్రభావం పడి ఆర్ జేడి కి ఒక 135 స్థానాలు గ్యారంటీగా వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.. ఇప్పటి బ్లాస్ట్ ప్రభావం , దాని టైమింగ్ ఎన్నికల పై పడుతుందా అనేది పోల్ స్టర్స్ ను తొలుస్తున్న ప్రశ్న.
పోలింగ ప్రారంభం కావడానికి కేవలం 12 గంటల ముందు, అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావం బీహార్ లో రెండో దశ పోలింగ్ పై పడే అవకాశం కేవలం ఐదుశాతం మాత్రమే ఉంటుందంటున్నారు. ఆ ప్రభావం కూడా పట్టణాలూ, నగరాలకే పరిమితమౌతుందనీ అంటున్నారు. అయితే ఆ ఐదు శాతం ప్రభావమే.. సీట్ల లో భారీ తేడాను తెస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఘటబంధన్ ఆ ప్రభావం ను అడ్డుకోగలిగితే గెలుపు వాకిట్లో బోల్తా పడే పరిస్థితి నుంచి కూటమి బయటపడుతుంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhi-blast-effect-on-delhi-blast-39-209343.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.