ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ.. తొలి ఆధిక్యతలు బీజేపీకే
Publish Date:Feb 7, 2025
Advertisement
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఆధిక్యతలు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 17 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. ఇలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ పటిస్ట ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద కలిపి పది వేల మందితో భద్రత కల్పించింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టలాలంటే ఏ పార్టీ అయినా కనీసం 36 స్థానాలలో విజయం సాధించాలి. 70 అసెంబ్లీ స్థానాలకూ 266 మంది పోటీలో నిలిచారు. ఎంత మంది రంగంలో ఉన్నారన్నది పక్కన పెడితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, ఆప్ ల మధ్యే ఉందని. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి.
http://www.teluguone.com/news/content/delhi-assembly-elections-poling-strt-25-192540.html





