పవన్‌పై పరువు నష్టం కేసు.. పోటీకి అనర్హుడిని చేయాలనే ప్లాన్?

Publish Date:Jul 25, 2023

Advertisement

ఏపీలో అధికార వైసీపీ,  జనసేన  మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంటుంది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ యుద్దానికి ఆజ్యం పోశాయి. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల డేటాను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని.. ఆ డేటా ఆధారంగా ఏపీలో మహిళలను ట్రాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లతో పాటు ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఆరోపణలకు ఇంత వరకూ ప్రభుత్వం నుండి వివరణ అయితే రాలేదు కానీ.. ఇష్టారాజ్యంగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాటల దాడి చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే ఏపీ మహిళా కమీషన్ కూడా నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా పరువు నష్టం కేసు వేశారు. అది కూడా క్రిమినల్ డిఫమేషన్ కేసు కావడం విశేషం.

ఓ మహిళా వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సివిల్ కోర్టులో ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల తాను మానసిక వేదనకు గురయ్యానని మహిళా వాలంటీర్ పేర్కొన్నారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేయగా.. న్యాయమూర్తి కేసును విచారణకు కూడా స్వీకరించారు. నిజానికి ముందుగా ప్రభుత్వమే పవన్ పై పరువు నష్టం కేసు వేయాలని నిర్ణయించింది. వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సీసీపీ 199/4 యాక్ట్ కింద కేసు నమోదు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది.

కానీ, ఈ లోగానే ప్రభుత్వ తరపున కాకుండా ఓ మహిళా వాలంటీర్ తో పరువు నష్టం డిఫమేషన్ కేసు నమోదయ్యేలా చేశారు. ఇలా మహిళా వాలంటీర్ తో పిటిషన్ దాఖలు చేయించడం వ్యూహాత్మకమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఆ వ్యూహం ఏంటన్నది తెలియాలంటే ముందుగా మనకి పరువు నష్టం కేసు, డిఫమేషన్ కేసుపై కాస్త అవగాహనా కావాలి. ఇప్పుడు పవన్ పై పెట్టిన కేసు  బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పెట్టిన కేసులాంటిదే. 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈ కేసు దాఖలు చేశారు. ప్రధాని ఇంటి పేరుతో ఉన్న వాళ్లంతా దొంగలే అనే అర్ధం వచ్చేలా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో  రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష   విధించింది. ఈ కేసులో హైకోర్టు కూడా రాహుల్ కి వ్యతిరేకంగా తీర్పు నివ్వగా ఈ కేసు ప్రస్తుతం సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉంది.

 ఒకవేళ సుప్రీమ్ కోర్టు కూడా రాహుల్ కి రిలీఫ్ ఇవ్వకపోతే   రాహుల్ గాంధీ 2024 ఎన్నికలలో పోటీకి అనర్హుడు అవుతారు. ఇప్పుడు పవన్ పై కూడా అలాంటి కేసు పెట్టడం వెనక జనసేనానిని కూడా ప్రత్యక్ష పోటీకి అనర్హుడిగా చేయాలన్నప్లాన్ ఉండవచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే, 2024 ఎన్నికలకు నిండా ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా ఈ కేసు ఈలోగా తేలడం కష్టమే. రాహుల్ గాంధీ కేసు ఇప్పటికి నాలుగేళ్లు అయినా ఇంకా తెలనేలేదు. మరి ఇప్పుడు వాలంటీర్ తో వైసీపీ నేతలు పెట్టించిన ఈ కేసులో ఫైనల్ తీర్పు ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియదు. 

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.