కాంగ్రెస్ కోరి తెచ్చుకున్న ఓటమి!

Publish Date:Mar 7, 2025

Advertisement

జో జీతేగా ఓయీ సిఖందర్.. గెలిచినవాడే రాజు, ఏమి చేశారు, ఎలా గెలిచారు, అనేది తర్వాత చర్చ. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎనికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కమల దళం తమ ఖాతాలో కలుపుకుంది.మూడింట రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడం సహజంగానే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.  ముఖ్యంగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కరీంనగర్ పట్టభద్రుల సీటును బీజేపీ కైవసం చేసుకోవడం, బీజేపీలో జోష్  పెంచింది. కాంగ్రెస్ ను కృంగదీసింది. మరోవంక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర రాజకీయ సమీకరణలలోమార్పు మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా మేథావులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతంగా భావిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్  చీకటి ఒప్పందమే, తమ ఓటమికి కారణమని కాంగ్రెస్ నాయకులు.. సామాన్య ప్రజలపై ఓటమి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఇది పరవు నిలుపుకునే ప్రయత్నం. బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం.  

మరోవంక, రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికి అందినట్లే సంబర పడి పోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలు బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ  పతనం ప్రారంభమైందని సంబర పడి పోతున్నారు. 

అదే సమయంలో రహస్య పొత్తులు, లోపాయికారీ ఒప్పదాల పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలో నిలవక పోవడం, బీఎస్పీ బరిలో నిలవడం కమల దళానికి ఉభయ తారకంగా కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలోనే  బీజేపీ, బీఆర్ఎస్  మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే  కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయ లోపం, అభ్యర్ధిని ప్రకటించడంలో జాప్యం, ఇలా కాంగ్రెస్ ఓటమికి చాలానే  కారణాలు ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

అదెలా ఉన్నా.. బీజేపీ అనుసరిస్తున్న నూతన ప్రచార వ్యూహం, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నిబద్దతతో సాగించిన ప్రచారం కమల దళానికి కలిసొచ్చిందని  అంటున్నారు. అవును రాజకీయ అనుబంధ బాంధవ్యాలతో సంబంధం లేకుండా, రాజకీయ విశ్లేషకులు అందరూ ప్రశంస పుర్వకంగానో, ఆందోళన పూర్వకంగానో  కాషాయ   బీజేపీ క్యాడర్ కమిట్మెంట్ ను మెచ్చుకుంటున్నారు. చివరకు  పార్టీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే వామపక్ష మేథావులు సైతం  బీజేపే క్యాడర్  ఐడిలాజికల్  కమిట్మెంట్’తో పనిచేయడం వల్లనే బీజేపీ మూడింట రెండు సీట్లు గెల్చుకుందని అంగీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రణాళిక బద్ధంగా పార్టీ కార్యకర్తలు చేసిన ప్రచారం, బీజేపీ గెలుపునకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతే కాదు, కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్  బీజేపీ అసలు బలంగా విశ్లేషకులు గుర్తిస్తున్నారు.  

మరోవంక కాంగ్రెస్  పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేక పోవడంతో చే చేతులా గెలుపును చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి  కాంగ్రెస్  అభ్యర్ది నరేంద్ర రెడ్డి, ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కొత్త ఓటర్లను చాలా పెద్ద సంఖ్యలో చేర్పించారు.అలాగే  కాంగ్రెస్ టికెట్ ఆశించి చివరకు బీఎస్పీ అభ్యర్ధిగా బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా ముందు నుంచి క్షేత్ర స్థాయిలో పని చేశారు. అయితే చివరికి టికెట్  రాక పోవడంతో ఆయన బీఎస్పీ టికె పై పోటీకి దిగి, బీజేపీ అభ్యర్ధి గెలుపునకు పరోక్షంగా సహకరించారు. నిజానికి  కాంగ్రెస్ నాయకత్వం హరికృష్ణ,  నరేంద్ర రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరే బరిలో నిలిచేలా చేసుంటే, కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకలా సాగేది. అందుకే  కాంగ్రెస్ ఓటమికి ఇంకా అనేక కారణాలు ఉన్నా, నాయకుల మధ్య సమన్వయ లేకపోవడం, క్యాడర్ లో ఉత్సాహం, కమిట్మెంట్ లేక పోవడం కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో  విషయమేంటంటే.. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం గెలుపు పై  అంతగా దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ  చివరకు, శుభం పలకరా .. పెద్దన్నా అంటే  కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి ఓడిపోయినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదన్న చక్కటి సందేశం  ఇచ్చివచ్చారు. పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  కూడా పార్టీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేయడంలో శ్రద్ద చూపలేదు.

పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని  ఆ నాలుగు జిల్లాలో కేవలం నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ కార్యకర్తలను కలుపుకుని గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తే.. కాంగ్రెస్ పార్టీకి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా క్యాడర్ ను  సక్రమంగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరోక్షంగానే అయినా  క్షేత్ర స్థాయిలో తాను ఒంటరి పోరాటం చేయవలసి వచ్చిందనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విధంగా చూసినప్పుడు  ఇదొక రకంగా కాంగ్రెస్ పార్టీ కోరి తెచ్చుకున్న ఓటమి .. బీజేపీ పోరాడి సాధించిన విజయం అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.