200 కోట్ల ఆస్తులు.. విల్లాలు.. పామ్ హౌస్‌లు.." అంటూ యువతులను మోసం చేసిన మోసగాడు

Publish Date:Jun 10, 2026

Advertisement

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బయటకు చూస్తే కోటీశ్వరుడు.. మాటల్లో చూస్తే పెద్ద వ్యాపారవేత్త.. కానీ వాస్తవానికి మాత్రం మ్యాట్రిమోని సైట్లను అడ్డాగా చేసుకుని యువతులను మోసం చేసిన కేటుగాడిగా పోలీసులు గుర్తించారు.దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ వెంకట కామేష్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.

ప్రముఖ మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో తనను రూ.200 కోట్ల ఆస్తులున్న వ్యక్తిగా పరిచయం చేసుకునే   కామేష్. విల్లాలు, వ్యవసాయ భూములు, పామ్ హౌస్‌లు, భారీ వ్యాపారాలు ఉన్నట్లు ప్రొఫైళ్లలో పేర్కొని యువతులను ఆకర్షించేవాడు. ఉన్నత వర్గాలకు చెందిన మ్యాట్రిమోని సైట్లలో అదే సామాజిక, ఆర్థిక వర్గానికి చెందిన వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని నమ్మకం సంపాదించేవాడని పోలీసులు చెబుతున్నారు.

మొదట స్నేహం, ఆ తర్వాత ప్రేమ, చివరికి పెళ్లి హామీ.. ఇదే కామేష్ అనుసరించిన వ్యూహంగా పోలీసులు గుర్తించారు. యువతులతో సన్నిహితంగా మెలిగిన తర్వాత వ్యాపార అవసరాలు, అత్యవసర పరిస్థితులు, పెట్టుబడుల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి మాట నమ్మి కొందరు యువతులు భారీ మొత్తాలు ఇచ్చినట్లు సమాచారం.బాధితుల నుంచి సేకరించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టకుండా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లలో ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. లక్షల్లో వచ్చిన డబ్బును జూదం తరహా కార్యకలాపాల్లో పోగొట్టుకు న్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కామేష్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో యువతి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా మరో  కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు, మచిలీపట్నంలో నమోదైన మరో కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్‌పై కస్టడీకి తీసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలు, మ్యాట్రిమోని ఖాతాలు, ఫోన్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  "పెళ్లి పేరుతో నమ్మకం... కోటీశ్వరుడి ముసుగులో మోసం... మ్యాట్రిమోని సైట్లను ఆయుధంగా మార్చుకున్న వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు.
ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
వైసీపీ హయాంలో చారిత్రాత్మక రుషికొండకు బోడిగుండు కొట్టి, పర్యావరణ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ.. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న విషయంలో గత రెండేళ్లుగా మల్లగుల్లాలు పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ధీరజ్ సేథ్ తండ్రి భారత సైన్యంలో త్రీస్టార్ జనరల్ గా సేవలందించి పదవీ విరమణ చేశారు. ఆయన కుమారుడు ఆయన కంటే ఉన్నత స్థాయికి చేరుకుని ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర 57 రోజుల సాగనుంది. శుక్రవారం (జులై 3) ప్రారంభమైన ఈ యాత్ర రాబోయే వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ స్పీకర్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్ సరిహద్దుల గుండా ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ సీఎన్‌బీసీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే తమ అంతిమ వ్యూహమని.. ప్రస్తుత చర్చలు అమెరికాకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.