వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు.. మిస్టరీ ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం

Publish Date:Mar 7, 2025

Advertisement

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మారాయి. పోలీసులు సైతం ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసులో నిందితుల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారన్న వార్తలు వెలువడినప్పటికీ, రంగన్న భార్య మాత్రం తన భర్తతి సహజ మరణం కాదని అంటున్నారు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురు సాక్షులు మరణించారు. ఇటీవల మరణించిన రంగన్న ఐదో వాడు. దీంతో పోలీసులు ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించాలన్న నిర్ణయానికి వచ్చారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ ఈ కేసులో సాక్షులు వరుసగా మరణిస్తుండటం వెనుక వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల వెనుక నిందితుల హస్తం ఉందా అన్న కోణంలో  దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు. 

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించినా, తరువాత అది హత్య అని తేలడంతో మాట మార్చి.. ఈ హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. తన సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటే కథనాలు ప్రచురించారు, ప్రసారం చేశారు. అప్పట్లో అంటే తాను విపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి అధకారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ మాటమార్చారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత పట్టువదలకుండా సీబీఐ దర్యాప్తును సాధించారు. 

సీబీఐ దర్యాప్తులో వివేకా హత్య వెనుక ఉన్నది సొంత మనుషులే అని దాదాపుగా తేలిపోయింది. దర్యాప్తు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చింది. అయితే సీఎంగా జగన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ  సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.  కోర్టు తీర్పు వెలువడకపోయినా.. వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న  పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరన్న విషయంలో జనానికి ఒక క్లారిటీ వచ్చేశారు. అయితే ఈ కేసులో సాక్షుల వరుస మరణాలపై అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. 

గత ఐదేళ్లలో వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు మరణించారు. ప్రత్యక్ష సాక్షి, వైఎస్ వివేకా ఇంటి వాచ్ మేన్ రంగన్న బుధవారం (మార్చి 5) ఆస్పత్రిలో మరణించారు. తన భర్తది సహజమరణం కాదు అన్న రంగన్న భార్య ఫిర్యాదుమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
కాగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు, పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి కూడా రంగన్నది సహజమరణం కాదన్న అనుమానం వ్యక్తం చేశారు. తొలుత వైఎస్ మరణాన్ని గుండెపోటుగా నమ్మించడానికి ప్రయత్నించారు. అది కుదరకపోయే సరికి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు రంగన్న మృతిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. 

ఈ సందర్భంగా ఆయన పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఒకరి తరువాత ఒకరుగా అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు కూడా మరణిస్తున్నారని రవి పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల మిస్టరీ నిగ్గు తేల్చాలని ఆయన విజ్ణప్తి చేశారు. కాగా జిల్లా ఎస్పీ కూడా వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు విస్తుగొల్పుతున్నాయని పేర్కొన్న సంగతి విదితమే. అంతే కాకుండా సాక్షుల మృతి వెనుక మిస్టరీని ఛేదించడానికి డిఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.   

By
en-us Political News

  
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.