ఎన్నికల బరిలో దస్తగిరి, కోడికత్తి శీను.. జగన్ కు ఇక వణుకే!

Publish Date:Mar 12, 2024

Advertisement

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యంకోసం అనేక అడ్డ‌దారులు తొక్కారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.విపక్షాలు అవి కేవలం విమర్శలు కావు, వాస్తవాలు అంటూ పలు ఉదాహరణలు చూపుతున్నారు. ఇంతకీ జగన్  గ‌త ఎన్నిక‌ల్లో అంత‌లా   ఏం చేశారు.  ఆయ‌న విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన అంశాలు ఏమిటి ?  అన్న ప్రశ్నకు   ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారికి వెంట‌నే  గుర్తుకు వచ్చేవి బాబాయ్ హ‌త్య, కోడికొత్తి  దాడి. ఈ రెండు ఘ‌ట‌న‌లు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క భూమిక పోషించాయ‌న‌డంలో ఎలాంటి  సందేహం లేదు.  ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి రావ‌డంతోపాటు, భారీ సంఖ్య‌లో అసెంబ్లీ, ఎంపీ సీట్ల‌ను గెలుచుకోవ‌డానికి ఈ రెండు ఘ‌ట‌న‌లు ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయి. అయితే  ఆ రెండు ఘ‌ట‌న‌లుకూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయ‌న్నవిమర్శ:లు అప్పటి నుంచీ ఉన్నాయి. ఆ విమర్శలు కేవలం విమర్శలు కావు, వాస్తవమే అనిపించేలా ఈ ఐదేళ్లలో ఆ కేసుల విషయంలో జరిగిన పరిణామాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు ఉణ్నాయి.  దీంతో జ‌గ‌న్ తాను తీసుకున్న గొయ్యిలో తానే ప‌డ‌బోతున్నాడ‌ని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించి.. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య, మ‌రోవైపు కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌లు ఎంతో దోహ‌ప‌డ్డాయి. గ‌త ఎన్నికల స‌మ‌యంలో వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచల‌నాన్నే సృష్టించింది.  అప్పట్లో వివేకాను హత్య వెనుక అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న అనుచ‌రులే ఉన్నారని ప్ర‌జ‌లు న‌మ్మేలా చేయ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, ఇటీవల కాలంలో వివేకా హత్య కేసులో బయటపడుతున్న నిజాలు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. వివేకా హత్య కేసులో జగన్ ప్రోత్సాహం, అవినాశ్ ప్రమేయం ఉందని ఆ కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా  బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌ గా మారాడు. జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు  వ‌చ్చాడు. ప్రస్తుతం ద‌స్త‌గిరి సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి స‌వాల్ విసురుతున్నాడు. పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.  జై భీమ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు.

మరోవైపు కోడిక‌త్తి కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీ‌నివాస్ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గత‌ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అద్భుత విజ‌యం సాధించ‌టంలో కోడికత్తి శ్రీ‌నివాస్ ది కూడా కీల‌క భూమిక అని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. జ‌గ‌న్ ఎలాగైనా 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ఉద్దేశంతో ఎయిర్ పోర్టులో జ‌గ‌న్ పై కోడిక‌త్తితో శ్రీనివాస్ దాడికి ప్ర‌య‌త్నించాడు. ఈ దాడిలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భుజానికి స్వ‌ల్ప గాయ‌మైంది. అప్పట్లో తనపై  దాడిచేయించింది చంద్రబాబు, ఆయన మనుషులే అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతి పొందిన జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీను మాత్రం.. జగన్ పై ప్రజల్లో సింపతీ రావాలనే తాను అలా చేశానని చెప్పాడు. తాజాగా కోడికత్తి శ్రీను.. అసెంబ్లీలో ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిపిన అభ్యర్థిని ఓడించేందుకు పోటీ చేయబోతున్నాడు. కొడికత్తి శీను కూడా జైభీమ్ భారత్ పార్టీలో చేరి  అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. 

2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయానికి దోహదపడిన ఈ రెండు ఘటనల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులూ కూడా 2024 ఎన్నికల్లో  జగన్ కు వ్యతిరేకంగా పోటీలో  నిలవనుండడంతో  జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పులివెందులలో దస్తగిరి, అమలాపురంలో కోడికత్తి శ్రీను ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతున్నది. ఎన్నికల వేళ వారిద్దరూ నిజాలను ప్రజలకు వెల్లడిస్తే, ఆ రెండు ఘటనల్లో జగన్ ప్రమేయం ఉందని చెబితే వైసీపీని ప్రజలు చీదరించుకుకుంటారన్న ఆందోళన జగన్ లోనూ ఆయన శిబిరంలోనూ వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే   జగన్ ఐదేళ్ల అక్రమ, అరాచక పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఓటమి ఖాయమైంది. తాజాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి ఆ కేసులకు సంబంధించిన నిజాలను బయటపెడితే ఇక వైసీపీకి పడతాయనుకుంటున్న కాసిని ఓట్లు కూడా పడవన్న ఆందోళన వైసీపీ అభ్యర్థులను వెంటాడుతున్నది.  ఏపీలో తాజా పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు.. జగన్ తీసిన గొయ్యిలో ఆయనే పడబోతున్నారంటున్నారు.   

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.