సామాన్యులకు కేంద్రం దసరా కానుక.. ధరల తగ్గింపు

Publish Date:Sep 22, 2025

Advertisement

సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి పలు వస్తువుల ధరలు తగ్గి గొప్ప ఉపశమనం సామాన్యుడికి  కలిగించ నున్నాయి. ఈ ధరల తగ్గింపు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వచ్చింది.  జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇటీవల కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ తగ్గింపు ధరలు దరసరా కానుకగా నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇలా తగ్గే ధరలలో సామాన్యులకు నిత్యావసరం అయిన పాల ధరలు దిగి వచ్చాయి.  పాలు, టీవీ, కారు.. ఇలా దాదాపు 400 వస్తువల ధరలు తగ్గాయి. పేదలు, సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త జీఎస్టీ స్లాబులను అమలులోకి తీసుకువచ్చింది. ఆ తగ్గింపు నేటి నుంచి జనాలకు అందుబాటులోకి వచ్చింది.  కారు, టీవీ-ఫ్రిడ్జ్, హోమ్ అప్లియన్సెస్, పాలు, నెయ్యి, వెన్న, జున్ను, బట్టలు, బూట్లు ఇలా పలు వస్తువులు ఇక చౌకగా లభిస్తాయి. మదర్ డైరీ, అమూల్, ఐటీసీ వంటి కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఇప్పటికే తగ్గించాయి.  

కొత్త విధానం మేరకు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి జీఎస్టీ కేవలం రెండు శ్లాబ్‌ లలో  అంటే 5శాతం, 18% మాత్రమే ఉంటుంది. పాలు, పనీర్, నెయ్యి, సబ్బు, షాంపూ వంటి  నిత్య వస్తువులతో పాటు ఏసీలు, కార్లు వంటివి 5శాతంజీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. దీనితో  సామాన్యులకు ఆర్థికంగా మంచి వెసులుబాటు లభిస్తుంది.  

పాశ్చురైజెడ్ పాలు, వెన్న, నెయ్యి, వెన్న నూనె, పాల స్ప్రెడ్‌లు, పనీర్ (  పనీర్, రోటీ, చపాతీ, పాపడ్, పాస్తా, నూడుల్స్, కౌస్కాస్, పేస్ట్రీలు, కేకులు, బిస్కెట్లు, కార్న్ ఫ్లెక్స్, స్టీల్ గిన్నెలు, నమ్కీన్, భుజియా, మీక్షర్ (ప్యాకేజ్ చేసినవి), సాస్‌లు, మసాలాలు, మసాలా పొడి, టీ, కాఫీ పౌడర్, షికోరి కాఫీ గింజలు, జామ్, జెల్లీ, మార్మాలాడే, కొబ్బరి నీళ్లు (ప్యాక్ చేసినవి), కండెన్సడ్ పాలు, టూత్ బ్రష్, డెంటల్ ప్లేట్ బ్రష్, టూత్‌ పేస్ట్, పళ్ళ పొడి, టాయిలెట్ సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, షేవింగ్ లోషన్, ఆఫ్టర్ షేవ్, నేప్కిన్లు, పిజ్జా బ్రెడ్, పరాఠా, పరోటా బ్రెడ్, మట్టి గిన్నెలు, సిరామిక్ టేబుల్‌ వేర్, కిచెన్‌ వేర్, డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు, అంజూర పండ్లు, పైనాపిల్, అవకాడో, మామిడి,  నారింజ, మాండరిన్లు, ద్రాక్ష పండు, నిమ్మకాయలు , ఇతర డ్రై ఫ్రూట్స్, గింజల మిశ్రమాలు (చింత పండు తప్ప), బ్రెజిల్ గింజలు, చక్కెర స్వీట్స్, చాక్లెట్, ఇతర బేకరీ ఉత్పత్తులు, ఐస్ క్రీం, సూప్‌లు, రసం, టమోటా, పుట్టగొడుగుల నిల్వలు, వెనిగర్లో నాన పెట్టిన కూరగాయలు, ఈస్ట్, బేకింగ్ పౌడర్, టెక్స్చరైజ్డ్ వెజిటబుల్ ప్రోటీన్, ఎక్స్‌ట్రూడెడ్ నమ్‌కీన్, కొబ్బరి వెన్న, కొబ్బరి నూనె, కొబ్బరి పొడి, మాల్ట్-బార్లీ, కూరగాయల రసాలు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ కుక్కర్, రైస్ కుక్కర్, హీటర్, గ్రైండర్, మిక్సర్, జ్యూసర్, కుట్టు మెషిన్, వాక్యూమ్ క్లీనర్, ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిట్నర్, ఎలక్ట్రిక్ షేవర్, రూ. 2500 లోపు ఉన్న చెప్పుల ధర, కార్పెట్, వెదురు, మెటల్ ఫర్నిచర్, చెక్క ఫర్నిచర్, ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్, గ్లాస్ గాజులు, కొవ్వొత్తులు, గొడుగులు, హ్యాండ్‌ క్రాఫ్ట్ హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, పర్సులు, హ్యాండ్‌ బ్యాగులు, షాపింగ్ బ్యాగులు, చేతితో తయారు చేసిన శాలువాలు, టోపీలు, పెన్సిళ్లు, క్రేయాన్లు, పాస్టెల్లు, సుద్ద, రబ్బరు బ్యాండ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్ కార్లు, బొమ్మలు, ప్లేయింగ్ కార్డ్స్, చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు, ఎడ్యుకేషనల్ టాయ్స్, పేపర్‌ బోర్డ్, వ్యక్తిగత ఉపయోగం కోసం అన్ని మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, రియాజెంట్లు, ఫీడింగ్ బాటిళ్లు, సర్జికల్ చేతి గ్లవుజులు, కాంటాక్ట్ లెన్సులు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, సిమెంట్, జనపనార, వరి పొట్టు, జిప్సం, సిసల్, బాగస్సే, పత్తి కాండాలు, సిరామిక్ బిల్డింగ్ బ్రిక్స్, బ్లాక్స్, టైల్స్, తబలా, మృదంగం, వీణ, సితార్, ఫ్లూట్, షెహనాయ్, ఢోలక్, సైకిల్, డిష్ వాషర్,350సీసీ వరకు ఉన్న బైక్ లు, స్కూటర్లు, మోపెడ్‌లు, ఆటో, ఈ-రిక్షా, కార్లు విద్యుత్ వాహనాలు, అంబులెన్స్, బస్సులు, ట్రక్కులు, టైర్లు, ట్రాక్టర్ విడి భాగాలు, అగ్గిపుల్లలు వంటి ధరలు తగ్గాయి.   

By
en-us Political News

  
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.