జగన్ పార్టీకి జడ గండం?
Publish Date:Jul 9, 2025
Advertisement
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్. ఇదే అతి పెద్ద గండం అనుకుంటే ఆయన ఇంటా బయటా కూడా స్త్రీ మూలక సమస్యలను ఎదుర్కుంటున్నట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ కారణంగా భువనేశ్వరి మాతను అనరాని మాటలని.. ఆపై అది పార్టీకి అతి పెద్ద చేటు తెచ్చిన అంశంగా తయారైంది. కట్ చేస్తే నేడు ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ కోవూరు మాజీ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతిరెడ్డిని కూడా సరిగ్గా ఇలాంటి మాటలే అని పార్టీకి మమూలు చెడ్డ పేరు తేలేదు. బేసిగ్గా జగన్ తన పథకాలన్నిటిలోనూ మహిళలే ప్రధానంగా ఉండాలని భావించే రకం. ఎందుకంటే మగాళ్ల మూడు, ఓటు ఏ క్షణం ఎలా టర్న్ అవుతుందో తెలీదు. అదే మహిళలు అలాక్కాదు. వారి ఓటు- రూటూ అంతా స్ట్రయిట్ గా ఉంటాయని ఆయన నమ్మకం. అందుకే తన ఇంటి నుంచి తల్లి, చెల్లి దూరమైనా సరే, రాష్ట్రంలో ఇంటింటా ఉన్న మహిళలనే తన తల్లి , చెల్లిగా భావించారాయన. సరిగ్గా అదే సమయంలో కన్న తల్లి, తోడబుట్టిన చెల్లితో పాటు.. తనకు సోదరి వరస అయ్యే వైయస్ సునీత నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు జగన్. అంతే కాదు.. ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజనీ సైతం జగన్ అంటే వ్యతిరేకత వ్యక్తబరుస్తున్నట్టు కనిపిస్తోంది. తనపై ఇన్ని కేసులు నమోదవుతుంటే పార్టీ నుంచి కనీస మద్ధతు లేదని రజనీ వాపోతున్నట్టు సమాచారం. దీంతో ఆమె జగనన్నను తెగ తిట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి రోజా లోలోన ఎన్ని రాజకీయపు ఎత్తుగడలు వేస్తున్నారో ఆ వెంకన్నకే ఎరుక అంటున్నారు. నగరి వైసీపీలోకి గాలి సోదరుడ్ని సాదరంగా ఆహ్వాస్తుండటంతో.. పైకి నవ్వుల మేకప్పు వేసుకున్నా.. లోలోన జగనన్నను తుక్కు తుక్కుగా తిట్టుకుంటున్నారట సదరు మహిళా నేత రోజా సెల్వమణి. దీంతో జగన్ కి ఎటు చూసినా జడ గండం తప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ లీడర్లలో దాదాపు సగానికి సగం మంది మహిళలంటే ఎంత మాత్రం గౌరవం లేని బాపతు. గంజాయి, మద్య సేవనంలో ఆరి తేరిన నిష్ణాతులు కావడం వల్ల.. వారికీ సెన్సిబిలిటీ తెలీక పోవడం వల్ల.. మహిళలపై అకారణంగా నోరు పారేసుకోవడంతో.. జగన్ పని ఇక్కడ తథిగిణతోం అయిపోతోందట. మొన్న ఎన్నికల ముందు వంశీ చేసిన మహిళా వ్యతిరేక ప్రేలాపనలు ఎంత చేటు తెచ్చాయో.. తెలిసి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి అనే ఈ నేత మరోమారు మహిళపై చేసిన కామెంట్లు ప్రస్తుతం జగన్ పార్టీని మరో పతనానికి కారణమయ్యేలా చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికే ఒక మహిళను అన్న పాపానికి 11 కి పరిమితమైంది జగన్ పార్టీ. వచ్చే రోజుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఆ పక్కనున్న ఒకటి కూడా మాయమవుతుందేమో అన్న టాక్ స్టేట్ వైడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/danger-from-women-to-jagan-party-39-201613.html





