డాన్స్ పాల్ డాన్స్

Publish Date:Oct 26, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తార స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు చతురంగ బలాలను రంగంలోకి దింపి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణల పర్వం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇతా మునుగోడులో వాతావరణం హీటెక్కింది.

ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై దాడి యత్నం జరిగింది. కాంగ్రెస్ ప్రచార సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇలా ఒకటేమిటి ప్రతి రోజూ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రతి రోజూ నియోజకవర్గానికి తరలుతున్న సోమ్ము కోట్లలో పట్టుబడుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని 24 గంటల వ్యవధిలో మూడు సార్లు తనిఖీ చేశారు.

 అయితే ఇంతటి ఉద్రిక్తతల్లోనూ, ఇంతటి సీరియస్ వాతావరణంలోనూ ఓ వ్యక్తి ప్రచారం మాత్రం నియోజకవర్గ ప్రజలకు కామెడీ పంచుతోంది. వారిని కడుపుబ్బా నవ్విస్తోంది. వినోదాన్ని అందిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నిక రంగంలోకి దిగారు. అసలు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో గద్దర్ పోటీకి సుముఖత చూపకపోవడంతో పాల్ స్వయంగా తానే బరిలోకి దిగారు.  అయితే ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేని కారణంగా పాల్ మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.  

తనకు ఓటేసి గెలిపించాలంటూ కేఏ పాల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చివరాఖరికి బీజేపీ అభ్యర్థ కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిని కూడా కలిసి తనకే ఓటేయాల్సిందిగా అభ్యర్థించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తన ప్రాచారంలో తీన్ మార్ డ్యాన్సులతో ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు.

ఓ జానపద పాటకు పాల్ డాన్సు చేస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో తెర వైరల్ అవుతోంది. తన డాన్స్ తో, హావభావాలతో పాల్ మునుగోడు ప్రజలకు వినోదం పంచారు. అంతేనా ప్రచారంలో భాగంగా ఒక సెలూన్ లోకి వెళ్లి అక్కడ హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. దీపావళి సందర్బంగా పాల్ ఓటర్లకు మిఠాయిలు పంచారు.  మునుగోడు ఉప ఎన్నికల బరిలో పాల్ నిలలబడకపోయి ఉంటే గొప్ప వినోదాన్ని మిస్ అయి ఉండేవాళ్లమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల ప్రచారం కంటే పాల్ ప్రచారమే బహు పసందుగా ఉందని సెటైర్లు వేసుకుంటున్నారు.

By
en-us Political News

  
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.