మేమెంతో మాకంత అయ్యే పనేనా?

Publish Date:Jun 17, 2025

Advertisement

తెలంగాణలో కులం కుంపట్లు రాజుకుంటున్నాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలుగా మారి పోతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మేమెంతో మాకంత (జనాభా ప్రాతిపదికన పదవుల పంపకం) నినాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో కానీ, రాష్ట్రంలో రెంటికి చెడిన రేవడి చేస్తుందా అనే మీమాంస కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. 

ముఖ్యంగా.. ఇటీవల చేపట్టిన మంత్రివర  విస్తరణలో  రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం.. అలాగే, పీసీసీ కార్యవర్గంలో ముందెన్నడూ లేని విధంగా సింహా భాగం (68) శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి హక్కుదారులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి  మొదలైందని అంటున్నారు.  కేవలం పదవులు ఆశించి భంగ పడిన నాయకుల్లోనే కాదు..  ఇప్పటికే పదవుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం  నాయకుల్లోనూ రేపటి గురించిన గుబులు, తమ రాజకీయ భవిష్యత్ గురించిన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.  
సామాజిక న్యాయం మంచిదే  కానీ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం, మరీ పూచిక పుల్లలా తీసి పారేశారన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళడం పార్టీకి మంచిద కాదని అంటున్నారు. నిజానికి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాదు.. కాంగ్రెస్ అభిమానులు, విశ్లేషకులలోనూ అదే మాట విన వస్తోంది.   

అయితే..  ఇప్పటికిప్పుడు తొందర పడితే ప్రయోజనం ఉండదని, స్థానిక  ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో  మిగిలిన మూడు ఖాళీల భర్తీతో పాటుగా, మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో ఆ క్రతువు కూడ పూర్తయ్యే వరకు ఆగుదామని, రెడ్డి  నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

మరో వంక, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న కులగణన, బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు, పీసీసీలో బడుగులకు పెద్ద పీట..వంటి నిర్ణయాలను అమలు చేసిన రాష్ట్ర నాయకత్వం, చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనక పడిందని అంటున్నారు. నిజానికి.. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మనార్ధం అన్నట్లుగా..  అధిష్టానం ఆదేశాలను పాటించిన  రాష్ట్ర నాయకత్వం బడుగులకు జరిగిన మేలును జనంలోకి తీసుకెళ్ళే విషయంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఫలితంగా, ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏ మేరకు దక్కుతుందనే విషయంలో అనుమానాలు  ఆందోళనలు  వ్యక్తమవుతునాయి. 

మరో వంక.. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తున్నదనే ఆందోళన పురుడు పోసుకుంది. ఈ నేపధ్యంలోనే..  ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ ఏర్పాటుతో పాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే..  బడుగుల్లోనూ మున్నూరు కాపు, లంబాడ సహా ఇంకా మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవులు దక్కని  కులాలు చాలానే ఉన్నాయి. దీంతో.. ఆ వర్గాల వారు  మామాటేంటని అడుగుతున్నారు.  అలాగే..  ముస్లిం మైనారిటీలు.. ఇతర మైనార్టీ వర్గాలు కూడా.  దీంతో.. మేమెంతో మాకంత  నినాదం  ఆచరణ  సాధ్యమేనా? అనే అనుమనాలు వ్యక్తంవుతున్నాయి. అనుమానాలు కాదు, సాధ్యం కాదని కూడా అంటున్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే, దీర్ఘ కాలంలో పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఒక విధంగా..  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది  అన్నట్లు అవుతుందా అనే అనుమానాలు, అపశ్రుతులు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఇండియా, ఇంగ్లాండ్ మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఇండియా విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేస్తు చాలు. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. అద్భుత ఫామ్ లో ఉన్న రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు.
రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్‌‌ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు.
గోవా గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఇటీవల అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రశన్నకుమార్ రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఈ విషయంలో కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. అయితే.. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి వ్యాఖ్యలపై ఖండనలు వెల్లువెత్తాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి కొత్త అంతరిక్ష విధానాన్ని ప్రకటించిన చంద్రబాబు సర్కార్.. ఈ విధానం అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబునాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.
బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు.
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డి పల్లె కట్టపస మామిడికాయల లోడ్ తో వెడుతున్న లారీ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 14) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.