ప్యూర్ ముర్రా బ్రీడ్ సేవలో ABC సెమన్ బ్యాంక్... పశుసంపద పెంపులో అవిరళ కృషి..!
Publish Date:Jun 21, 2025

Advertisement
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి. కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు. 1970 వరకు రైతు భారతానిది ఇదే పరిస్థితి. ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు, దృఢంగా, ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి. హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా... దేశీ గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది, ఈ నేపథ్యంలో సగటున 20 నుంచి 25 లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను తీరుస్తోంది... ముర్రా బ్రీడ్ మాత్రమే! ఈ విషయాన్ని గ్రహించిన ఆదర్శపోషకుల్లో ఒకరు... రాజీవ్ చిలకపాటి. లండన్ లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ... స్వదేశానికొచ్చాక తన ఆశయంపై దృష్టిపెట్టారు. వ్యవసాయంపై మక్కువ... ఆవులు, గేదెలు, కోళ్లపై అలవిమాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు.
ఏటికేటికీ అంతరించిపోతున్న మేలుజాతి పశుసంపదను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్య సాధనలో భాగంగా ABC మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో వ్యయప్రయాసలకోర్చి అధిక పాలచార కలిగిన ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారు. ABC సెమెన్ స్టేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ గా...నాణ్యతలో రాజీ పడకుండా అత్యుతన్నత ప్రమాణాలతో ల్యాబ్ ను నెలకొల్పారు. నాలుగు ఎకరాల్లో అధిక పాల చారనిచ్చే ఉత్తమమైన ముర్రా దున్నపోతులతో... పశుసంపద వృద్ధి, జన్యు మెరుగుదలపై దృష్టిపెట్టారు. నియంత్రిత పర్యావరణంలో ఉన్న ABC సెమన్ స్టేషన్ చూడాలంటే మాత్రం ... ముందస్తు అనుమతి తీసుకోవాలి.
సందర్శకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతీ విభాగంలో వెటర్నరీ టెక్నిషియన్స్ సూచించిన విధంగా బయోసెక్యూరిటి ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రవేశం ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడే సంపూర్ణంగా శానిటైజ్ చేసుకోవాలి. ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి మారేటప్పుడు శానిటైజ్డ్ చేసిన యాప్రాన్స్, మాస్క్, హెడ్ క్యాప్ ధరించాలి. ఎక్కడి చెప్పులు అక్కడే విడిచిపెట్టాలి. నాలుగు ఎకరాల ఈ సువిశాల ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యంలో సందర్శకులు అడుగడుగునా మానిటరింగ్ చేయబడతారు. అధిక వంశపారంపర్యం గల వీర్యం ఉత్పత్తి చేసే వ్యవస్థ కావడం వల్ల... సమర్థవంతమైన నిర్వహణ విషయంలో రాజీవ్... ఎక్కడా రాజీపడకపోవడం వారి నిబద్ధతకు తార్కాణం
అధికపాడి, లైంగిక, జన్యుపరమైన వ్యాధుల్లేని ప్రీమియర్ ముర్రా బ్రీడ్ ను అభివృద్ధి చేయడం ABC సెమన్ స్టేషన్ ముఖ్య ఉద్దేశం. ABC ఫ్రోజెన్ సెమన్ స్ట్రాస్ తయారయ్యే క్రమంలో... ప్యూర్ ముర్రా దున్నల నుంచి సేకరించిన వీర్యాన్ని..?అనేక కఠిన పరీక్షలు చేస్తారు. నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు. ఫ్రెంచ్ మినీ స్ట్రాలో 0.25 ఎమ్.ఎల్. నిక్కచ్చిగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసోనిక్ సీలు చేసి, ఇంక్‌జెట్ ముద్రిస్తారు. ఒక్కో స్ట్రాలో దాదాపు 2 కోట్ల వీర్యకణాలుంటాయి. ఈ స్ట్రాస్ ని డ్రీప్ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు. నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యానుల్లో భద్రపరిచి... దేశవ్యాప్తంగా పాడి రైతులకు పంపిణీ చేస్తారు
గేదెల నుంచి వచ్చే పేడను ఎప్పటికప్పడు మిని ట్రాక్టర్ పడ్లర్ తో నెట్టేస్తారు. ఆ వ్యర్థాన్ని కూలీలు దూరంగా పోగేస్తారు. పశువుల కడిగిన నీళ్లు, మూత్రాన్ని... ఓ పెద్ద బావిలో సేకరిస్తారు. ఆ నీటిని తమ పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తుంటారు. అలా సహజంగా పండించిన గ్రాసాలు, దాణాల మిశ్రమాన్నే మేపడం వల్ల కాబోలు దూడల నుంచి గేదెల వరకు అన్ని చలాకీగా కనిపిస్తుంటాయి. ఈ డెయిరీ చూసిన పాడిరైతులు ఎవరైనా సరే... నాలుగు బ్రీడ్ దూడలో, పడ్డలో మన పాకలో కూడా ఉంటే బాగుండనేలా ప్రభావితం చేస్తుంది రాజీవ్ డెయిరీ. ఇంతలా తోటి పోషకులను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవస్థ నిర్మాణంలో రాజీవ్...సుదీర్ఘ ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి... శ్లాఘనీయం! ఉత్తరాది ఆదర్శ రైతులను సైతం దక్షిణాదికి రప్పించిన ఆయన నైపుణ్యశైలి... హర్షణీయం మొత్తంగా పాడి రైతు ఆర్థికాభివృద్ధికి అవిరళ కృషిచేస్తున్న రాజీవ్ సంకల్పం... అభినందనీయం...!
VEERAVALLI -521 110, KRISHNA DISTRICT, A.P. STATE
WWW.abcsemenstation.com
+91 96667 61111 + 91 98666 71111
info@abcsemenstation.com
abc_ap_in@gmail.com
http://www.teluguone.com/news/content/dairy-production-39-200413.html












