మొంథా తుపాను నష్టం రూ.5, 265 కోట్లు

Publish Date:Oct 31, 2025

Advertisement

మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను నష్టం, కష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (అక్టోబర్ 30) రోజంతా వివిధ సాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతం, మండలం, గ్రామం నుంచి సమాచారం రాబట్టారు.  మొంథా తుపాను కారణంగా పంటలకు, రహదారులకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలు సేకరించారు.  

అనంతరం తుపాను కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టం విలువ 5 వేల 265 కోట్ల రూపాయలుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సమీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... తుపానును ఆపలేం కానీ, స్పష్టమైన విజన్ తో, ముందు జాగ్రత్తలు తీసుకుంటే భారీ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చునని నిరూపించామని చెప్పారు. తుపాను కారణంగా ప్రాణనష్టం వాటిల్లకుండా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.  తుపాను నష్టం ఎంతన్నది ప్రాథమిక అంచనా వేశామనీ, ఎన్యుమరేషన్ జరిగిన తరువాత పూర్తి నష్టం ఎంతన్నది తేలుతుందని వివరించారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామన్న చంద్రబాబు కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.  

తుపాను సమయంలో అధికారలు, సిబ్బంది చాలాబాగా పని చేశారనీ, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేయడం ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామనీ వివరించారు. ఆ కారణంగానే ప్రాణనష్టం లేకుండా చేయగలిగామనీ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చేయగలిగామనీ అన్నారు. ఇక పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని చెప్పారు.  

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.