ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Publish Date:Oct 8, 2025

Advertisement

 

బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తాం.... బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం ..కుబేర సినిమా తరహాలోనే  సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్ప డుతున్నారు.. ఈ సైబర్ నేరగాళ్లు అడ్డ మీద ఉన్న కూలీలను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బుల ఎరగా వేసి బ్యాంకు అకౌంట్లను  తెరిపిం చుకుంటున్నారు.


కొంతమంది వ్యక్తులు అయితే నేరుగా కూలీలు ఉండే అడ్డా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కూలీలతో మాటామంతి కలుపుతారు. బ్యాంకు అకౌంటు తెరిచి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇందు కొరకు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు... వారి మాటలు నమ్మిన కూలీలు డబ్బుల కోసం బ్యాంకు అకౌంట్లు తెరిచేం దుకు సిద్ధమవు తారు. 

 ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన  కూలీలను నేరుగా బ్యాంకుకు తీసు కెళ్ళి బ్యాంకులో అకౌంట్ ని తెరిపి స్తారు.ఆ తరువాత ఈ ముఠా బ్యాంకు పాస్ బుక్కు, ఏటీఎం కార్డులు రాగానే వీటన్నిటిని కలెక్ట్ చేస్తారు... ఈ తతంగమంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది... అవునండోయ్ ఇది నిజం... ఇలా కుబేర సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కూలీలే టార్గెట్

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడ్డా మీద ఉన్న కూలీలను టార్గెట్ గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లను తెరిపి స్తున్నారు.ఆ తర్వాత పాస్ బుక్, ఏటీఎం కార్డులను నేరుగా కర్ణాటక కు పంపిస్తారు ..అది కూడా కేవలం  బస్సులోనే పంపిస్తారు. ఎవ్వరి కి కూడా ఇక అకౌంట్లు తెరిపిం చినట్లు తెలియదు.బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఈ మూట కూలీలకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడతో వీళ్ళ పని అయిపోతుంది.


ఇప్పుడు అసలు కథ మొదలైంది.

 ఆ ముఠా నేరుగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోని ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ బ్యాంకు అకౌంట్లుల న్నింటినీ కూడా బెట్టింగ్ యాప్లకు కనెక్ట్ చేస్తారు.. ఈ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకొని వెళ్ళిపో తారు.. సైబరాబాద్ లోని ఎస్వోటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తో కర్ణాటకలో ఉన్న ముఠాపైన నిఘా పెట్టారు. ఈ ముఠా నేరుగా ఒక కాల్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోనీ దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వహి స్తుంది

 ..బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చే డబ్బులన్ని టిని కూడా అడ్డా మీద కూలీల ద్వారా ఓపెన్ చేయించిన అకౌంట్లోకి మళ్ళీ స్తారు ..ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే వీటిని క్లోజ్ చేస్తారు అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక సైబరాబాద్ పరిధిలోనే వందల కొద్దీ నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిపిం చినట్లుగా పోలీ సులు గుర్తించారు. నకిలీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న దొప్పలపూడి నవీన్‌ కుమార్‌, వంకద్రి సందీప్‌ కుమార్‌, చింతల పాటి ప్రుధ్వి రామ రాజు,చింతల పాటి పవన్‌ వెంకట నాగ భారద్వాజ్‌, మామిడి శెట్టి రామాంజనేయులుఅనే ఐదుగురు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తం గా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. నిందితులు నకిలీ గేమింగ్‌ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని అధికారులు తెలిపారు. 

ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణ లో వెల్లడైంది.ఈ గ్యాంగ్‌ టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని.... “Dodge book777” అనే గేమింగ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బులు మళ్లించారని అధికారులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్‌ ఫోన్లు, 32 చెక్‌ బుక్స్‌, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్‌ కార్డులు, 14 లక్షల నగదు , సంబంధిత ఖాతాలను సీజ్‌ చేసినట్లు అధికా రులు తెలిపారు.ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్‌ వివరాలను ఎవరికీ ఇవ్వకూ డదని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను ఉప యోగించకుండా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

   

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.