ఎల్ నినో ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలలో సాగుకు తిలోదకాలేనా?

Publish Date:Jul 25, 2026

Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు  ముఖం చాటేయడంతో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.  నెలకొన్నాయి. వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ  వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.   పలు గ్రామీణ మండలాల్లో నేల కనీసం ఒక్కసారి కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. ఈ అనావృష్టి ప్రభావం  పంట సాగుపైనే కాకుండా తాగునీటి నిల్వలపై కూడా  ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

తెలంగాణలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది.  సాధారణ వర్షపాతం   35 శాతానికి పైగా లోటు నమోదైంది. రాష్ట్రంలోని పాతిక పైగా జిల్లాలలో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఉమ్మడి వరంగల్,  నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది.   ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు  కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో వ్యవసాయానికి నీటిని విడుదల చేయడం నిలిపివేసి, ఉన్న కొద్దిపాటి జలాలను  తాగునీటి అవసరాలకే  కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని 400కి పైగా మండలాల్లో నేలలో తేమ శాతం  పడిపోయింది. అనంతపురం,  సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాధారంగా సాగయ్యే వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మిర్చి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాలు లేక విత్తనాలు వేయడం  ఆలస్యం కావడం, నాటిన మొలకలు ఎండిపోతుండటంతో చిన్న, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి.  

కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా ప్రధాన నగరాలు కూడా నీటి కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలపై  ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో నగరపాలక సంస్థలు ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. అత్యవసర సమయంలో నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటం కోసం ట్యాంకర్లను సిద్ధం చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను నిశితంగా పర్యవేక్షించడంపై అధికారులు దృష్టి సారించారు.

వాతావరణ శాఖ  వివరాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో  ప్రభావం వల్ల రుతుపవనాల గమనం మందగించింది. అల్పపీడన ద్రోణులు మధ్య, పశ్చిమ భారత ప్రాంతాల వైపు తరలిపోవడంతో తెలుగు రాష్ట్రాలలో వానలు కురవడం లేదు.   జులై చివరి వారంలో లేదా ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.  

Kharif Cultivation Crisis,  Water Scarcity in Telugu States, Absence, Southwest Monsoon

By
en-us Political News

  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది
వైరస్  వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు   ఆరోగ్య శాఖ సిబ్బంది  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను  గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
దక్షిణ కొరియా రూపొందించిన 15,000 TEU అణుశక్తి ఆధారిత కార్గో నౌక డిజైన్‌కు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు లభించింది. జంట మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లు MSR మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, సముద్ర వాణిజ్యంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషించనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.