దోసకాయ నీరు ఇలా తాగితే ఎంత ఈజీగా బరువు తగ్గచ్చో..!

Publish Date:Jun 14, 2024

Advertisement

దోసకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. దీన్ని నేరుగా తినేసేవారు కొందరైతే..  ఉప్పు కారం చల్లుకుని,  కాస్త మసాలా జోడించి స్పైసీగా తినేవారు మరికొందరు. జ్యూస్ చేసుకుని తాగేవారు ఇంకొందరు.  చాలామంది ఆరోగ్య స్పృహతో డిటాక్స్ వాటర్ తయారుచేసుకుని తాగుతుంటారు. అందులో తప్పనిసరిగా కీరదోసకాయను చేర్చుతారు. అటు నోటికి రుచిని ఇస్తూ, ఇటు ఆకలి తీరుస్తూ.. మొత్తం మీద బరువు తగ్గడంలో మ్యాజిక్ చేసే కీర దోసకాయను నీటిలో వేసి ఆ తరువాత  ఆ నీటిని తాగడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని డైటీషియన్లు అంటున్నారు. ఇంతకీ ఈ కీర దోసకాయ కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..


కీర దోసకాయ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చాలా బాగా చల్లబరుస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని నిలిపి ఉంచుతుంది. అయితే కీర దోసకాయను ముక్కలుగా చేసి దాదాపు లీటరుకు పైగా నీటిలో వేయాలి. ఈ నీరు ఇంకా బాగా రుచిగా ఉండటం కోసం ఇందులో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, అల్లం వేసుకోవచ్చు.  ఒక జార్ లో ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి.  దీన్ని 1-2  గంటల పాటూ అలాగే కదపకుండా ఉంచాలి.  ఆ తరువాత ఈ నీటిని తాగవచ్చు.


లాభాలేంటంటే..

చర్మం పొడిబారడం, శరీరంలో మంట,  మైకము వంటివి శరీరంలో నీటి కొరత ఏర్పడటం వల్ల సంభవించే సమస్యలు. ఈ దుష్ప్రభావాలను తగ్గించడానికి సాధారణ సమయాల్లో అయినా,  వేసవి వేడి సమయంలో అయినా ఈ నీటిని తీసుకోవడం ఉత్తమం.  దోసకాయ నీటిలో జోడించే ఇతర పదార్థాల వల్ల  ఇది  అదనపు రుచితో ఉల్లాసంగా ఉంచుతుంది.

దోసకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.


కీర దోస నీటిలో ఉండే  ఫైబర్‌లు,  ఎంజైమ్ ల  కారణంగా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇది సెల్యులార్ స్థాయిలో చర్మం  పొరలను క్లియర్ చేస్తుంది. చర్మాన్ని  మెరుగుపరుస్తుంది.


దోసకాయల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ,  విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ సహజ యాంటీఆక్సిడెంట్లు. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా ఇవి సహాయపడతాయి.


దోసకాయలో చక్కెరలు తక్కువగా ఉంటాయి. ఇది  బరువు పెరగడానికి దోహదం చేయదు. పైపెచ్చు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది,  అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.