వివాహం అయిన ప్రతి జంట ఈ  దశలను దాటుకుంటూ వెళ్లాలి..!

Publish Date:Sep 30, 2025

Advertisement

 

ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనేది చాలా  కీలకమైన దశ. ఇద్దరు వ్యక్తులు పెళ్లికి  ఒప్పుకుని, మూడు ముళ్లతో ఒకటైనంత సులువుగా వారి వైవాహిక జీవితం ఉండదు.  రెండు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వారు ఒకేచోట ఉండటం అంటే చాలా అభిప్రాయ బేధాలు కూడా వస్తుంటాయి. అయితే అభిప్రాయ బేధాలను దాటుకుంటూ.. ఇద్దరూ కలిసి ఉండటంలోనే వైవాహిక బంధాన్ని నిలబెట్టుకునే నేర్పు ఉంటుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో కొన్ని దశలను తప్పక దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ దశలు ఏంటో.. వాటిని దాటేటప్పుడు జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకుంటే..

 

పెళ్లైన కొత్తలో..
పెళ్లైన కొత్త.. స్త్రీ, పురుషుల జెండర్ అట్రాక్షన్ చాలా బలంగా ఉంటుంది.  అందుకే ఈ దశలో ఇద్దరూ చాలా క్లోజ్ గా, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉంటారు. ఆ దశలో ఒకరు చేసే తప్పును మరొకరు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా అది ఎక్కువ సేపు ఉండదు. దీనికి కారణం శారీరక రిలేషన్. అయితే పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య శారీరక రిలేషన్ సరిగా లేకపోతే.. వారిమధ్య చిన్న విషయాలు, చిన్న తప్పులు కూడా చాలా పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. కాబట్టి పెళ్లైన కొత్తలో భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే అది శారీరక బంధంతోనే సాధ్యం.

 

రియాలిటీ చెక్..
పెళ్లంటే కేవలం భార్యాభర్తల మధ్య సరదాలు, సంతోషాలు, అలకలు, షికార్లు.. ఇవి మాత్రమే కాదు.. పెళ్లయ్యాక ఇద్దరికి బాధ్యతలు పెరుగుతాయి. వాటికి తగ్గట్టు ఇద్దరికి వేర్వేరు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల కారణంగా ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. విమర్శించుకుంటూ ఉంటారు. ఇది భార్యాభర్తలకు పెద్ద సవాల్ గా మారుతుంది. ఎప్పుడు కూడా వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరూ కలిసి జీవితాన్ని ఎట్లా లీడ్ చేసుకుంటారు అనే దాని మీద ఇద్దరి ఆలోచన ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా డీల్ చేసుకోవడంలోనే బంధం బలం ఎంతో బయటపడుతుంది.

 

సర్దుబాటు..
అడ్జస్ట్మెంట్.. ఇది చాలా ముఖ్యమైన ఆయుధం. భార్యాభర్తల బంధం అయినా, స్నేహం అయినా, వ్యాపారం అయినా, ప్రేమ అయినా సర్దుబాటు అనేది లేకపోతే అది ఎప్పటికీ విజయవంతం కాదు. ముఖ్యంగా బార్యాభర్తల బంధంలో సర్దుబాటుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాజీ పడటం, ఓర్పుగా ఉండటం, ఏ సమస్య వచ్చినా బ్యాలెన్స్ గా ఉండటం వంటివి బంధాన్ని నిలబెడతాయి.

 

పేరెంట్స్..
పెళ్లైన ప్రతి జంటకు తల్లిదండ్రులు కావడం ఒక అపురూపమైన దశ. ఇద్దరు కాస్తా ముగ్గురు కావడం, ఆ తరువాత సంఖ్య పెరగడం.. ఇది చాలా అద్బుతంగా ఉంటుంది.  రెండు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తామే ఒక కుటుంబాన్ని క్రియేట్  చేసుకోవడం వాళ్ళ ఉనికిని తెలిపే విషయం. పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు ఎట్లాగైతే పెళ్లైన తర్వాత మార్పులకు లోనవుతాయో.. పెళ్లైన తర్వాత ఉండే చాలా విషయాలు.. పేరెంట్స్ అయిన తరువాత మార్పులకు లోనవుతాయి. కొత్త ప్రాధాన్యతలు వస్తాయి.  కొత్త బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల దశ చాలా బాధ్యతాయుతమైనది.

 

మిడ్ లైఫ్ ఛాలెంజెస్..
మిడ్ లైఫ్ అంటే 40 ఏళ్ళు దాటిన తరువాత నుండి 60ఏళ్ళు టచ్ చేసే వరకు. ఈ ఇరవయ్యేళ్ల కాలంలో తల్లిదండ్రులకు చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి. పిల్లలు పెద్దవాళ్లు అవుతూ ఉంటారు. లైఫ్ లో సెటిల్ కావడానికి ఇల్లు కొనడం, పిల్లల చదువుల ఖర్చులు, పిల్లలు పెద్దగవడం, తల్లిదండ్రుల బాధ్యతగా పిల్లల పెళ్లిళ్ళు.. ఆరోగ్యం.. ఇట్లా చాలా విషయాలు ఛాలెంజ్ లు ఇస్తాయి.

 

సహవాసం..
సహవాసం అంటే కలిసి ఉండటం అని చాలా మందికి తెలుసు. కానీ.. భార్యాభర్తల లైఫ్ లో కలిసి ఉండటం ఒకరికి ఒకరు అనే అభిప్రాయం చాలా దృఢంగా మారేది వృద్దాప్యంలోనే. పెళ్లి అయ్యాక, పిల్లలు వచ్చాక వాళ్ల ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. కానీ వృద్దాప్యం వచ్చాక, పిల్లల పెళ్లిళ్లు అయిపోయాక.. అప్పుడే భార్యాభర్తలకు ఒకరికొకరు అనే స్థితి కాస్త  స్థిరంగా ఉంటుంది. ఈ జీవిత చివరి దశను ఎంత సంతోషంగా గడపగలిగితే.. ఆ భార్యాభర్తలు తమ అవసాన దశలో అంత తృప్తిగా జీవితాన్ని ముగించగలుగుతారు.

 

- రూపశ్రీ

 

By
en-us Political News

  
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.