క్రాస్ ఓటింగ్ పరువు తీసింది!

Publish Date:Sep 10, 2025

Advertisement

అనూహ్యం కాదు. అద్భుతం కాదు. అనుకున్నదే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్’ భారత 15 ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అవును..  గెలుపు ఓటముల వరకూ అయితే..  అధికార కూటమి అభ్యర్ధి గెలుపు  అనూహ్యం కాదు. విపక్ష ఓటమి అసాధారమూ కాదు. అధికార కూటమి అభ్యర్ధి విజయంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ  ఏ దశలోనూ లేవు.  

కానీ..  జరిగింది అది కాదు. విపక్ష ఇండియా కూటమి సంఖ్యా బలం లేక ఓడి పోవడం మాత్రమే కాదు.. ఉన్న ఓటులో చీలిక వచ్చింది. క్రాస్ ఓటింగ్ జరిగింది. అది కూడా..  ఒకటీ రెండు ఓట్లు కాదు..  ఏకంగా 14 మంది ఇండియా  కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.  అధికార కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు ఓటేశారు. అందుకే..  అధికార ఎన్డీయే కూటమి అభ్యర్ధి రాధాకృష్ణన్ కు  పార్టీల బలాబలాల ప్రకారం రావలసిన 437 ఓట్లకు బదులుగా  452 ఓట్లు అంటే 14 ఓట్లు అదనంగా వచ్చాయి.  విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి రావలసిన 315 ఓట్లకు గానూ, 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఇండియా కూటమి ఎంపీల్లో 14 మంది అధికార ఎన్డీఎకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో..  ఇండియా కూటమి ప్రధాన ఎన్నికల ప్లాంక్  అపొజిషన్ యూనిటీ, విపక్షాల ఐక్యత బొక్క బోర్లా పడింది. విపక్షాల ఐక్యత అయ్యే పని కాదని మరో  మారు సందేహాలకు అతీతంగా  తేలిపోయింది.

అలాగే..   ఇండియా కూటమి ఓట్లు అని అయితే చెప్పలేం కానీ..   మరో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి.  
అదొకటే కాదు..  ఉపరాష్ట్రపతి ఎన్నిక  విపక్ష ఇండియా కూటమిలో డొల్ల తనాన్ని బయట పెట్టిందని   విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి.. అభ్యర్ధి ఎంపిక మొదలు పోలింగ్ మేనేజిమెంట్ వరకు..  ప్రతి నిర్ణయంలోనూ ఇండియా కూటమి తప్పటడుగులే వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా.. ఓ వంక కులగణన పేరిట బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ పాలక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ఇది ఇండియా కూటమి నాయకత్వం చేసిన తోలి పెద్ద తప్పుగా పరిశీలకులు పేర్కొంటున్నారు. 

అలాగే..  సుదర్శన్ రెడ్డి  ప్రయోగించిన తెలుగు వారి ఆత్మ గౌరవం కార్డు  కూడా పనిచేయలేదు.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్,ఎంఐఎం తప్ప జగన్  రెడ్డి  పార్టీ వైసేపీతో సహా  మరే పార్టీ కూడా  రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేదు. అంతే కాదు..  పుండు మీద కారం పూసినట్లుగా  11 మంది ఎంపీలున్న  వైసీపీ ఏకంగా ఎన్డీయేకి మద్దతు ఇచ్చింది. స్వరాష్ట్రం తెలంగాణలోనూ సుదర్శన్ రెడ్డి  అదనంగా ఒక్క ఎంఐఎం ఓటు మాత్రమే యాడ్ అయింది. నిజానికి.. ఇండియా అభ్యర్ధి  సుదర్శన్  రెడ్డి కాకుండా ఇంకేవరైనా కూడా ఎంఐఎం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇండియా కూటమి అభ్యర్ధికే ఓటు వేస్తారనేది, జగ మెరిగిన సత్యం. మరో వంక నలుగురు రాజ్య సభ ఎంపీలున్న బీఆర్ఎస్ యూరియ  కొరతను సాకుగా చూపి పోలింగ్ కు దూరంగా ఉండి పోయింది.
అదలా ఉంచితే.. పోల్ మేనేజిమెంట్  విషయంలో ఇండియా కూటమి  పూర్తిగా తప్పులో కాలేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఏకంగా 15 ఓట్లు చెల్లలేదంటే..  ఇండియా కూటమి పోల్ మేనేజిమెంట్  ఎంత పూర్ గా వుందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే.. చివరకు రాహుల్ గాంధీ, పోలింగ్ బూత్ కు ఎలా వెళ్ళాలో తెలియక తడబడ్డ తీరును చూస్తే..  ఎక్కడో దిద్దుకోలేని తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.  

మరో వంక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, త్వరలో ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళ నాడు రాష్ట్రానికి చెందిన  మహా రాష్ట్ర గవర్నర్  సీపీ రాధా కృష్ణన్  ను అభ్యర్ధిగా ఎంపిక చేయడం మొదలు పోల్ మేనేజెమెంట్ వరకు ఎక్కడా చిన్న తప్పైనా జరగకుండా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. అందుకే రాధాకృష్ణ అనూహ్య మార్జిన్  తో విజయంసాధించారు.   అందుకే విపక్ష ఇండయా’ కూటమి అభ్యర్ధిది కేవలం ఓటమి కాదు.. అంతకు మించి.  

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.