రైతుల్ని ప‌ల‌క‌రించిన   కొత్త  అతిథి 

Publish Date:Jul 20, 2022

Advertisement

మ‌న ఊరు, మ‌న గుడి, మ‌న గుట్ట‌.. అనుకుని ఓ పెద్దామె చాలారోజుల త‌ర్వాత చెట్ల‌పొద‌లు తొల‌గి స్తుంటే స‌ర్రున నాగ‌రాజు లేచి ప‌ల‌క‌రించాడు. అంతే బామ్మ‌గారు అమాంతం వెల్ల‌కిలా ప‌డి లేచి ఇంటి దాకా ప‌రిగె త్తింది. పాములు, క‌ప్ప‌లు, తేళ్ల‌కు వీలు చిక్కాలే గాని ఇళ్ల‌లోకి రావ‌డానికే మ‌హా తొంద‌ర‌ ప‌డుతూంటా యి. ఇపుడు వాటి ఆ స‌ర‌దానే భ‌ద్రాచ‌లం జిల్లాలో ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. 

భారీవ‌ర్షాలు, ఇటివల కురిసిన భారీ వర్షాలకి భద్రాచలం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిం దే. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజలు కొంత కోలుకుంటున్నారు.భారీ వర్షాలతో గోదావరి తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా  ఇప్పుడిప్పుడే  గోదారమ్మ శాంతి స్తుంది. ఈ క్రమంలో పునరావాసాల నుంచి ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల  బాధితులు  ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  వరదనీటితోపాటు ఇళ్లలో, వాడల్లో పాములు,  తేళ్లు, మొసళ్లు, ఇతర ప్రమాదకర జీవులు చేరి గజగజ వణికిస్తున్నాయి. వాటికి మ‌నుషులు లేక‌పోతే ఆ ఇల్లు త‌మ‌దేన‌న్న భావ‌న ఉంటుందేమో! 

ఇళ్ల‌లోకి వ‌చ్చిన‌వాటి సంగ‌తి స‌రే. పొలంలోకి  ఎప్పుడు వ‌చ్చిందో బుర‌ద నీటిలో హాయిగా ప‌డుకున్న మొస‌లి పిల్ల కంట‌ప‌డింది. అంతే పొలంలోకి వెళ్లిన రైతులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఎక్క‌డో ఉండాల్సిన మొస‌లి పిల్ల‌ద‌యినాస‌రే ఇలా  తార‌స‌ప‌డ‌టం ఖంగారుపెట్టింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు కంగుతిన్నారు.  బురదలో ఏదో  క‌ద‌ల‌డం చూశారు. దగ్గరికి వెళ్లగా అది మొసలి పిల్లగా నిర్ధారించారు.  పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థ‌లానికి చేరుకున్న యానిమల్​ రెస్క్యూ టీమ్‌  పంట పొలంలో ఉన్న మొసలి పిల్లను పట్టుకు న్నారు. 

అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. వరదలకు అడవుల్లోని విష పురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.వీటిని గుర్తిస్తే చంప కుండా. . తమకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు నల్లాలను శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రజ లంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే నీటిని వాడుకోవాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.