ఒక వైపు విమర్శలు.. మరో వైపు వినతులు..!

Publish Date:Jun 23, 2022

Advertisement

దేశంలోని రాజకీయ పార్టీలలో  టీఆర్ఎస్ శైలే భిన్నం. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రాజకీయం ఇప్పటి దాకా అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న ధోరణిలోనే సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపిన తెరాస అధినేత కేసీఆర్.. ఆ తరువాత ఎన్నికల సమయంలో ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఆ తరువాత కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా బీజేపీకి బాసటగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీపై కారాలూ, మిరియాలూ నూరుతూ ఘాటు విమర్శలు చేస్తున్న సంగతీ తెలిసిందే. ఆయన కుమారుడు.. తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

తెలంగాణ గడ్డపై బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్రానికి నిథుల కోసం వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. తెలంగాణ గడ్డపై కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది శూన్యమంటూ విమర్శలు గుప్పిస్తూ.. ఢిల్లీ వెళ్లి కేంద్రం మంత్రులతో ప్రత్యేక భేటీలు అవుతున్నారు.

మోడీ హయాంలో తెలంగాణకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని ఆరోపిస్తున్న ఆయన అవకాశం దొరికితే హస్తినలో వాలిపోయి కేంద్ర మంత్రులతో సమావేశమౌతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ణప్తి చేసి వచ్చారు. వచ్చీ రాగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో బిజీ అయిపోయారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, నిధులు మంజూరు చేయకపోవడంపై దుమ్మెత్తి పోశారు. ఆ వెంటనే హుటాహుటిన హస్తినలో వాలిపోయిన ఆయన కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. హైద‌రాబాద్ డ్రైనేజీ సిస్టమ్‌, రోడ్ల నిర్మాణంకు ఆర్థిక సాయం చేయాల‌ని విజ్ణప్తి చేశారు.

వినతి పత్రం సమర్పించారు. కేంద్రం ఎన్నిసార్లు కోరినా పైసా విదల్చడంలేదని ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే.. మళ్లీ మళ్లీ కోరడం ఎందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కేటీఆర్ హస్తిన పర్యటనలపై రాజకీయ పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీకి ఎదురు పడటానికి సైతం ఇష్టపడకపోగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జాతీయ పార్టీని ప్రారంభించనున్నారు.

మరో వైపు ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం తరచుగా హస్తిన యాత్రలు చేస్తూ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు.  ఇదేం రాజకీయం తిరుమలేశా అంటే జనం అచ్చెరువొందుతున్నారు. తండ్రీ కొడుకుల భిన్న వైఖరులపై తెరాస శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.