సిట్టింగుల మార్పు పంచాయతీలన్నీ తాడేపల్లి ప్యాలస్ కే.. వైసీపీలో పతాక స్థాయికి సంక్షోభం!

Publish Date:Dec 30, 2023

Advertisement

అధికార వైసీపీలో సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో  ఎన్నికల హీట్  పెరగడంతోనే వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయ్యింది.  ఓటమి భయంతో వైసీసీ అధినేత  పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల  నియోజకవర్గాల   మార్పు చేపట్టారు.  అయితే జగన్ నిర్ణయం    పార్టీలో కాక రేపుతోంది. సీనియర్లు జూనియర్లు అని లేకుండా జగన్ మొండి నిర్ణయాలతో పార్టీలో ఇప్పుడు సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇప్పటికే 11 మందిని మార్చేశారు.  ఇప్పుడు రెండో విడత మార్పులకు  సంప్రదింపులు, కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో స్థానాల మార్పుకు ససేమీరా అంటున్న కొందరు ఎమ్మెల్యేలు, అసలు ఈసారి సీట్లు దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం గట్టిగానే  వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ రెండో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. శనివారం (డిసెంబర్ 30) ఈ రెండో  విడత మార్పులును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి శుక్రవారమే (డిసెంబర్ 29) ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు.  తాడేపల్లి జగన్ ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కూడా కనిపించింది. కానీ  కారణాలేంటో తెలియదు కానీ  సదరు ప్రకటన విడుదల కాలేదు.  రెండో జాబితాలో మార్పులూ చేర్పులూ ఇవేనంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.

వైసీపీ అభ్యర్థుల మార్పు జాబితాలో 35మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది.  వైసీపీ   వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు ఖరారు అయిన ఎమ్మెల్యేల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ నుండి కేకే రాజు, మాడుగుల నుండి బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్, నర్సీపట్నం నుండి పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరి దొరబాబు, పత్తిపాడు వరుపులు సుబ్బారావు. పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పొన్నాడ సతీష్, భీమవరం గ్రంధి శ్రీనివాస్, మంగళగిరి గంజి చిరంజీవి, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు,  కైకలూరు దూలం నాగేశ్వరరావు, తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వర రావు(నాని), తెనాలి అన్న బత్తుని శివకుమార్, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరు మహీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రం రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం కె. ఆర్. జె భరత్, జమ్మలమడుగు వైయస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, పులివెందుల వైయస్ జగన్మోహన్ రెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కె.వి ఉషశ్రీ చరణ్, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. 

కాగా నియోజకవర్గ మార్పునకు ఇష్టపడని ఎమ్మెల్యేలు, సీట్లు దక్కని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. వీరిని బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు అధిష్టానం అప్పగించింది. అయితే, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ బుజ్జగింపులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్ని పంచాయతీలు తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నాయి. వీటిని పరిష్కరించలేక   జగన్ తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జగన్ మాటలకు కూడా మెత్తబడని ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు.  గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే  వెళ్లిపోయేవారు తమ వారు కాదని, గెలవని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించలేమని అంటూ జగన్ అసంతృప్తులను మరింత రెచ్చగొడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కొత్త ఇంచార్జిల ఓటమి కోసమే పనిచేస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు. దీంతో వైసీపీలో సంక్షోభం ముదిరి పాకాన పడినట్లైంది. ఇది ఎన్నికల సమయానికి మరింత తీవ్రమై పార్టీ పుట్టి ముంచే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.