ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో సంక్షోభాలు.. అసలేం జరుగుతోంది?

Publish Date:Sep 12, 2025

Advertisement

ఇటీవలి  కాలంలో  భారత్ తో స్నేహ సంబంధాలకు దూరమైన ఒక్కో దేశం సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుంటోంది.   భారత్ తో విభేదించిన దేశాలన్నీ ఇలా సంక్షోభాలలో కూరుకుపోతుండటం కాకతాళీ యమనే చెప్పాలి.  బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవులు ఇలా ఈ దేశాలన్నీ వరుసగా, ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఆర్ధిక,రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. భారత్ ను వ్యక్తిగతంగా ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దౌత్యపరంగా ఆయాదేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పాలన్న భారత్ ప్రయత్నాలు ఏమంత ఫలించడం లేదు.  మాల్దీవుల విషయానికి వస్తే.. ఆ దేశాధ్యక్షుడు   ముయిజ్జూ  ఇండియా ఔట్ నినాదంతో గెలిచారు. అనంతరం చైనాతో చేతులు కలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ 2024లో తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. దాంతో కళ్లు తెరిచిన ముయిజ్జూ భారత్ తో  సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అర్రులు చాస్తున్నారు. అయినా ఆ దేశంలో ఇప్పటికీ రాజకీయ  అస్థిరత రాజ్యమేలుతోంది. గతంలో అంటే భారత్ కు మిత్రదేశంగా ఉన్నంత కాలం మాల్దీవుల్లో సుస్థిరత చెక్కు చెదరలేదు.  

ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఆ దేశంలో  హసీనా ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ అస్ధిరత మొదలైంది.హిందువులపై దాడులు వారి ఆస్తుల ధ్వంసం జరిగాయి. ఆదేశంలో ఇప్పుడున్న స్రభుత్వం ఆర్మీ చేతిలో కీలుబొమ్మ.  పాకిస్థాన్, చైనాతో సన్నిహిత సంబంధాలు కోసం వెంపర్లాడుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావమే భారత్ జోక్యంతో ఏర్పడింది. ఆ విషయాన్ని మరచి భారత్ ను శత్రుదేశంగా చూడటం ప్రారంభించడంతోనే ఆ దేశం సంక్షోభ, కల్లోలాల నిలయంగా మారిపోయింది.  భారత అనుకూల విధానాలను అవలంబిచిన హసీనా అధికారంలో ఉన్నంత కాలం ఆ దేశం సుస్థిరంగా ఉంది. ప్రజాస్వామ్యదేశంగా సగర్వంగా నిలబడింది. ఆ తరువాతనే దేశంలో రాజకీయ అస్థిరత, అంతర్గత సంక్షోభం తలెత్తి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఇక శ్రీలంక విషయానికి వస్తే..  ఆ దేశం కూడా అకారణంగా భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని అవలంబించి చైనాకు దగ్గర కావడం కోసం ప్రయత్నాలు చేసి సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్ విషయం చెప్పనే అక్కర్లేదు. దాయాది దేశానికి బారత్ తో ఎన్నడూ సయోధ్య, సత్సంబంధాలూ లేవు. ఆ దేశం ఆవిర్భావం నుంచీ సంక్షోభాలతో సహవాసం చేస్తున్నదని చెప్పడం అతి శయోక్తి కాదు.  అలాగే మయన్మార్.. 2021లో సైనిక తిరుగుబాటు తరువాత ఆ దేశం సంక్షోభాల వలయంలో కూరుకుపోయి ఉంది.  తాజాగా భారత్ పై సుంకాల యుద్ధం ప్రారంభించిన అమెరికా కూడా పెను ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట నిలిచింది. భారత్ పై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇది అమెరికాకు నిజంగా తట్టుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు.

అంతే కాకుండా రష్యా, చైనాలు భారత్ కు స్నేహహస్తం చాచడంతో అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పుట్టిమునగక ముందే భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇరుదేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రధాని మోడీతో చర్చలకు ట్రంప్ వెంపర్లాడుతున్నారు. ఇక అలాగే సంక్షోభాలలో కూరుకుపోయిన ఇరుగుపొరుగుదేశాలు కూడా తమ భారత్ తో వైరానికి ఫుల్ స్టాప్ పెట్టి స్నేహ మార్గంలో పయనిస్తే..  ఆర్థిక, రాజకీయ ఆస్థిరత నుంచి సుస్ధిరత దిశగా వాటి అడుగులు పడే అవకాశం ఉంటుంది. 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.