హైదరాబాద్ లో రియల్ సంక్షోభం: నిర్మాణాలు వేగం.. కొనుగోళ్లు దాదాపు శూన్యం.!

Publish Date:Oct 22, 2026

Advertisement

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ రంగం కనీవినీ ఎరుగనిసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.  నిర్మాణాలు వేగంగా జరుగుతున్నా.. ఇళ్లు అమ్ముడుపోక రియల్ రంగం కుదేలౌతోంది.  విశ్వనగరంలో రియల్ ఎస్టేట్ రంగం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరించిన నివాస గృహాల నిర్మాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెతలెలబోతున్నాయి. ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసే వేగం కంటే కూడా రియల్ ఎస్టేట్ డెవలపర్లు నూతన ప్రాజెక్టులను నిర్మించే వేగమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి బిల్డర్లలోనూ, రియల్టర్లలోనూ తీవ్ర కలకలం రేపుతోంది. 

గృహాల సరఫరా,  డిమాండ్ మధ్య ఏర్పడిన ఈ గ్యాప్  హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్‌ను ఒత్తిడిలో పడేస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలు, నివేదికలు, సమాచారం మేరకు హైదరాబాద్ వ్యాప్తంగా రమారమి 29.6 కోట్ల చదరపు అడుగుల నివాస స్థలం విక్రయాలు జరగకుండా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన మొత్తం గృహ నిర్మాణ విస్తీర్ణంలో హైదరాబాద్ వాటా దాదాపు 30 శాతాం. ఇది హైదరాబాద్  రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఎన్నడూ లేని పరిణామమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  నగరంలోని పశ్చిమ భాగంతో పాటు ఐటీ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గడిచిన ఐదేళ్లలో భారీ ఎత్తున హైరైజ్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మితమయ్యాయి. డెవలపర్లు డిమాండ్‌ను మించి సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం..  నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తత దయనీయ స్థితికి ఇదే కారణమని అంటున్నారు.   సాధారణ,  మధ్యతరగతి కొనుగోలుదారుల శక్తికి మించి ప్రాజెక్టుల ధర   ఉండటం వల్ల విక్రయాలు మందగించాయని చెబుతున్నారు.మరోవైపు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కారణంగా  ఐటీ ఉద్యోగుల్లో  తమ ఉద్యోగాల కొనసాగింపు పట్ల వ్యక్తమౌతున్న అనిశ్చితి కూడా కొత్త కొనుగోళ్లు మందగించడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 నివాస గృహాలను వేగంగా పూర్తి చేయడంపై చూపిన శ్రద్ధ, మార్కెట్ కొనుగోలు సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ప్రదర్శించకపోవడంతోనే ఈ స్థాయిలో కోట్ల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉండిపోయిందంటున్నారు.   గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికిప్పుడు ఇళ్లు కొనడం కంటే వేచి చూడటమే మేలన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. ఈ కారణంగానే రెడీ టు ఆక్యుపై స్థాయిలో ఉన్న  గృహాలను కొనడానికి కూడాపెద్దగా ఎవరూ ముందుకు రావడంలేదు. 

ఈ కారణంగా రియల్ ఎస్టేట్,  నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టిన బిల్డర్లు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది.  బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలకు వడ్డీల భారం పెరగడంతో పాటు, రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అవసరమైన మూలధనం కొరతను బిల్డర్లు ఎదుర్కొంటున్నారు.     డెవలపర్లు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటేనే ఈ పరిస్తితి నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. గృహాల ధరల్లో సవరణలు చేయడం, కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రాయితీలు ప్రకటించడం,  అందుబాటు ధరల ప్రాజెక్టులపై దృష్టి సారించడం ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని అధిగమించడానికి వీలౌతుందని విశ్లేషిస్తున్నారు. లేకుంటే ముందు ముందు  హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్‌లో ధరల తగ్గుదల అనివార్యమౌతుందంటున్నారు.  

[Crisis in Hyderabad Real Estate, Unsold Housing, Hyderabad Residential Property, Real Estate Demand Supply, Hyderabad Housing Market, Telugu One]

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.