ఏపీలో క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ డౌన్!

Publish Date:Jun 5, 2023

Advertisement

గత మూడేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తన సేవలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపసంహరించుకోవడంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) డౌనైపోయింది. సీసీటీఎన్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 15,000 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌ల డేటాను ఏకీకృతం చేయడంలో పోలీసు విభాగాలకు ప్రధాన సాంకేతిక సాధనంగా ఉద్భవించింది.  సీసీటీఎన్ఎస్ కేవలం మౌస్ క్లిక్‌తో సమాచారాన్ని సేకరించడం  నిల్వ చేయడం, విశ్లేషించడం, తిరిగి పొందడం లాంటి సమాచారాన్ని బదిలీ చేయడంలో పోలీసులకు సహాయ పడుతుంది.

2012లో ఏపీలో తమ సేవలను ప్రారంభించినప్పటి నుంచి నేరాలను గుర్తించడంలో, కోర్టుల్లో కేసుల పురోగతిని గుర్తించడంలో పోలీసులు సీసీటీఎన్‌ఎస్‌పై ఆధారపడుతున్నారు. సీసీటీఎనగెస్ అమలు కోసం టీసీఎస్ 2012లో ఆంధ్ర పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఇది ఇటీవలి వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే, గత మూడేళ్లుగా ప్రభుత్వం టీసీఎస్‌కు బిల్లును క్లియర్ చేయడంలో  చూపిస్తున్న అలసత్వం కారణంగా నిర్వహణ సేవలను ఉపసంహరించుకుంది. అనేక మంది పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్ నిర్వహణలో శిక్షణ పొందినప్పటికీ, వారు సర్వర్‌లు, వివిధ డేటాబేస్‌లు, సిస్టమ్‌లను అనుసంధానించేటప్పుడు  కోర్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు.

టీసీఎస్ నిష్క్రమణ తర్వాత  సీసీటీఎన్ఎస్ సిస్టమ్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి సమస్యలు తలెత్తినట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పడిన సమస్యను కొంత మేర సరిదిద్దినా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీసు స్టేషన్లలో ఈ సేవ ఇప్పటికీ అందుబాటులో లేదు.  సిసిటిఎన్ఎస్ సమస్యపై సిబ్బందికి అవగాహన లేదని, అయితే జిల్లా యూనిట్లతో తనిఖీలు చేస్తున్నట్టు టెక్నికల్ సర్వీసెస్ డిఐజి ఎస్ వి రాజశేఖర్ బాబు అంటున్నారు. టీసీఎస్ కు పెండింగ్‌లో ఉన్నబిల్లుల కారణంగా  సేవ ఉపసంహరణ అంశంపై మాత్రం ఆయన  మాట్లాడలేదు.  ఇప్పటికే  కొనసాగుతున్న పరిశోధనలను ట్రాక్ చేయడం,  కొత్త నేరాలు, డేటాలను  నవీకరించడం రెండింటిలోనూ ఎస్ హెచ్ఓఎస్,  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీఎన్ఎస్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.

ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను అదే రోజున సీసీటీఎన్ఎస్ లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీసీఎస్ సేవలు లేని కారణంగా  పోలీసులు ఆ విధంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం నుంచి ఏపీ పోలీస్ సేవా మొబైల్ అప్లికేషన్, ఏపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ సేవలు నిలిచిపోయాయి. 

ఇక ఇలాంటి పరిస్థితి.. రాష్ట్రంలోని పలు పుర, నగరపాలక సంస్థలలో కూడా నలకొని ఉంది.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. పూర్తయిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)లో అప్ లోడ్ చేయడానికే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు.

బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రూ.15 లక్షల అంచనాలతో 12 పనులకు అధికారులు 15 సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పుర, నగర పాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి.  రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో చేసిన పనులకు రూ.750 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలో రూ.750 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కొత్త పనులకు గుత్తెదారులు ముందుకు రావడం లేదు.

పనులు పూర్తి అయినా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రెవెన్యూ జనరేషన్ లేదు.. రాబడి వస్తుందనే భరోసా లేదు.. తాజాగా టీసీఎస్.. ఏపీ ప్రభుత్వం బాధితురాలైంది.   నేరాలు, వాటి సంబంధిత డేటాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. అప్ డేట్ చేసే ప్రక్రియ ఆగిపోవడంతో..  పౌర భద్రతా డొల్లగా మారింది. దాంతో ఏపీ పోలీసు శాఖ  అధికారులు ఏం చేయాలో పాలు పోక..  ఆందోళనలో ఉన్నారు. మూడేళ్ల బిల్లులు చెల్లిస్తేనే.. సేవలు తిరిగి ప్రారంభిస్తామని టీసీఎస్ కుండ బద్దలు కొట్టేసింది.  

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.