శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై క్రిమినల్ కేసు!

Publish Date:Jun 16, 2026

Advertisement

ప్రముఖ  నటుడు ప్రకాశ్ రాజ్‌ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు,   రామాయణంపై  ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై  తిరుపతిలోని నాలుగవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.

బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు  భానుప్రకాష్ రెడ్డి తన న్యాయవాది కొత్తపల్లి అజయ్ కుమార్‌తో కలిసి సోమవారం (జూన్ 15) కోర్టులో ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. 

గతంలో కేరళలో జరిగిన  కేరళ లిటరేచర్ ఫెస్టివల్ తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై అంటే శ్రీలంకపై దండయాత్ర చేశారంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు భాను ప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. అప్పట్లోనే ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపి, హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు గానూ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే..  ఆ నోటీసులపై ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.   భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని,   రామాయణాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

 భారతదేశ సాంస్కృతిక, మతపరమైన ఐక్యతను దెబ్బతీసేలా ప్రకాశ్ రాజ్ ఆర్య, ద్రవిడ  సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని, ప్రాంతీయ విద్వేషాలను, మతపరమైన విభేదాలను రగిల్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని  వివరించారు. 

కోర్టు ఆవరణలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయి. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పమని నోటీసులు ఇచ్చినా ఆయన అహంకారంతో సమాధానం ఇవ్వలేదు కనుకనే.. చట్టం ద్వారా ఆయనకు బుద్ధి చెప్పేందుకు కోర్టులో ప్రైవేట్ కేసు వేసినట్లు చెప్పారు.  

తిరుపతి నాల్గవ అదనపు కోర్టు ఈ ప్రైవేట్ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. త్వరలోనే ఈ కేసుపై కోర్టు విచారణ జరిపి ప్రకాశ్ రాజ్‌కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.