జట్టుకు ఎంపిక కాలేదని క్రికెటర్ ఆత్మహత్యాయత్నం

Publish Date:Jun 22, 2022

Advertisement

ఆటలో గెలుపు ఓటములు సహజం.. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టం వచ్చిందని, వైఫల్యం ఎదురైందని తనువు చాలించుకునే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. కింద పడ్డ చోటే లేవాలి. ఓడిపోయిన చోటే గెలిచి నిలవాలి. ముఖ్యంగా ఆటగాళ్లలో సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకునే క్రీడా స్ఫూర్తి అత్యంత అవసరం. పాకిస్థాన్ కు చెందిన ఓ క్రికెటర్ చిన్న వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేశాడు.

దక్షిణ సింధ్ ప్రావిన్స్ కు చెందిన క్రికెటర్ షోయబ్  ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, సెలక్షన్స్ లో విఫలమై లోకల్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన షోయెబ్ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న షోయెబ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాకిస్థాన్ లోనే నాలుగేళ్ల కిందట ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అండర్-19 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ జర్యాబ్ అనే యువక్రికెటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏ క్రీడలోనైనా ప్రతి ఆటగాడూ ఏదో సమయంలో వైఫల్యాలను ఎదుర్కొనే ఉంటాడు. ఇది స్థానిక స్థాయిలోనైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా ప్రతి క్రీడాకారుడూ ఎదుర్కొనే పరిస్థితి. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ టెండూల్కర్ కూడా ఒక సమయంలో ఫామ్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.

ఏ క్రీడాకారుడైన సరే.. వైఫల్యం ఎదురైనప్పుడు మనో స్థైర్యంతో దానిని అధిగమించాలే తప్ప.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడటం ఎంత మాత్రం సమంజసం కాదు. అసలు క్రీడా రంగాన్ని ఎంచుకోవడం అంటేనే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం ఉందనే లెక్క. అలా కాకుండా వైఫల్యానికి కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం. 

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.