ధ‌న‌ దాహం పెంచేస్తున్న క్రికెట్‌!

Publish Date:Jun 5, 2022

Advertisement

ఇంగ్లీషువాడు భార‌త‌దేశాన్ని వ‌దిలిపోతూ అంటించిన జాఢ్యాలు రెండు.. ఇంగ్లీషు, క్రికెట్‌! పిల్ల‌లు ఇంగ్లీషు మీడియంలోనే చ‌ద‌వాలి, మాట్లాడాలి, ఆడితే క్రికెట్ మాత్ర‌మే ఆడాలి .. ఈ రెండు చేయ‌నివారు ఒట్టి పిచ్చాళ్లు! ప‌నికిరానివారు అదే గొప్ప అభిప్రాయం త‌ర‌త‌రానికి అందివ‌స్తున్న గొప్ప సంప్ర‌దాయం. పిల్ల‌లు చ‌దువుతోపాటు ఆట‌లూ ఆడాలి. వొంటికి వ్యాయామం అవ‌స‌రం గ‌నుక‌. పూర్వం క‌బ‌డ్డీ, ప‌రుగు పందెం, బ్యాడ్మింట‌న్ చాలా స‌హ‌జంగా ఆడేవారు. ఇప్పుడూ ఆడుతున్నారు. కానీ క్రేజ్‌, ప్ర‌తిష్ట‌, మీదు మిక్కిలీ మంచి ఆర్ధిక స్థాయి కోసం క్రికెట్ ఆడ‌టం జ‌రుగుతోంది.

త‌ల్లిదండ్రులు త‌మ మ‌గ పిల్ల‌ల్లో ఎవ‌రికయినా ఈ జాఢ్యం అంటి పొర‌పాటున అర కొర చాక‌చ‌క్యం చూపితే.. కాబోయే టెండూల్క‌ర్ అని, కాబోయే క‌పిల్ అనీ భావించుకుని కోచింగ్ పేరుతో వాడి జీవితాన్ని స‌ద‌రు కోచ్ చేతిలో పెడుతున్నారు. ఇది గ‌తంలో ప‌ట్ట ణాలలో వుండేది. ఇప్పుడు టీ 20లు, ఐపిఎల్ పుణ్యాన గ్రామీణ ప్రాంతాల్లోనూ అదో పెద్ద సోపానంగా భావి స్తున్నారు.  పైగా టాలెంట్ స‌ర్చ్ పేరుతో క్రికెట్ సంఘాలు  చిన్న వూళ్ల‌లోకి వెళ్లి వారి ఆట‌ను గ‌మ‌నించి న‌చ్చితే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చేయ‌మ‌ని అన‌డం జ‌రుగుతోంది. అదేదో మ‌హాద్భుతం,  ఇక రేపే మ‌నోడు టెస్ట్ ఆడ‌తాడు, ప‌నిగినీ వ‌దిలేసి టీవీ ముందు బైఠాయించాలి అని అమ్మ‌మ్మ‌లు, అమ్మ‌లు సైతం తెగ ఉత్సాహ ప‌డుతున్న రోజులివి. 

అస‌లు ఆ ఆట మ‌హత్తే అంత అని అంటూంటారు క్రికెట్‌ను అమితంగా ప్రేమించి తిండీ తిప్పలు మానేసిన‌వారు. ఎందుకంటే, మ్యాచ్‌లు, ప్లేయ‌ర్ల‌కంటే ఆ మ్యాచ్‌ల‌ను చూస్తూ డ‌బ్బు సంపాదించే ఓ కొత్త ద‌రిద్రం వ‌చ్చిప‌డింది. దాన్నే ఆంగ్లంలో  బెట్టింగ్ అంటారు. ఇది ఐపిఎల్ తో మ‌రింత విజృంభిస్తోంది. న‌ర న‌రానా ఆ పిచ్చి ఎక్కించేసుకుంటున్న యువ‌త‌, చిన్న‌పాటి వ్యాపార‌ సంస్థ‌ల‌వారు కూడా ఆవేశ‌ప‌డుతు న్నారు.  క్ర‌మేపీ ఆట‌ను ఆట‌గా చూడ్డం మానేసి వారి అభిమాన ప్లేయ‌ర్ ఆట తీరును క‌రెన్సీ కాయితా ల‌తో కొలుస్తూ ఆ వేడిలో ల‌క్ష‌లకు లక్షలు కోల్పోతున్నారు.  

క‌ష్ట‌ప‌డి ఏదో ఒక ప‌నిలో, లేదా వృత్తిలో ఆర్ధికంగా  మెరుగుప‌డ‌టం అనేది లోకం హ‌ర్షించే ప‌ద్ధ‌తి. కానీ కాల‌క్ర‌మంలో ఆట‌ల‌తోనూ కోట్లు గ‌డించ‌వ‌చ్చ‌న్న‌ది గొప్ప ఆర్ధిక సూత్రం కింద త‌యార‌యింది. ప్లేయ‌ర్లు ముఖ్యంగా క్రికెట్ ప్లేయ‌ర్లు త‌మ ప్రొఫెష‌న్‌లో ఉన్న‌త శిఖ‌రాలు అధిగ‌మించ‌డంలో ఆర్ధికంగా బాగానే నిల‌దొక్కుకుంటారు. దాన్ని ఆట్టే ప్ర‌శ్నించ‌లేం. కానీ వారి ఆట‌ను పిచ్చిగా ప్రేమించి ఆర్ధికంగా దిగ‌జారు తున్న కుటుంబాలు త‌యారు కావ‌డ‌మే ఊహించ‌ని ప‌రిణామం!  ప‌నీపాటా లేని ప‌ద‌కండు మంది ఆడే ఆట‌ను కోట్ల‌మంది బుద్ధిహీనులు ఎంజాయ్ చేయ‌డంలో కాలం విలువ తెలుసుకోలేక‌పోతున్నార‌ని పూర్వం ఒక ఆంగ్ల ర‌చ‌యిత అన్నాడు.  అప్పుడ‌న్న‌ది ఇప్పుడు అక్ష‌రాలా నిజం. మ‌త్తులో ప‌డితే గ‌మ్మ త్తుగ చిత్త‌వ‌డం అంటే ఇదేనేమో! 

     ఐపిఎల్‌లో ఆడితే దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం చాలా సులువు అనే గొప్ప ర‌హ‌స్య‌సారం ప్లేయ‌ర్లు కూడా బాగా జీర్ణించుకున్నారు. అంత‌కుముందు రంజీలో  స‌రిగా ఆడ‌క‌పోయినా, అదృష్ట‌వ‌శాత్తూ ఏదో ఒక జ‌ట్టుకి ఆడేందుకు ఈ టోర్నీకి సెల‌క్ట్ అయితే మారుమూల అమాయ‌కంగా వుండే చిన్న‌పాటి ప్లేయ‌ర్ కి కూడా క‌ళ్లు నెత్తినెక్కుతాయి.  వాడి అదృష్టం మ‌రీ అధిక‌శాతంలో వుంటే వాడికిక తిరుగే వుండ‌దు. ఇప్ప‌టి ట్రెండ్ అదే!  ఇక విదేశీ ప్లేయ‌ర్ల సంగ‌తి వేరు. వారికి కేవ‌లం డ‌బ్బు కావాలి. ఆట ఎలాగూ మ‌న‌వాళ్ల‌తో పోలిస్తే బాగానే ఆడ‌తారు.

ఒక‌వేళ ఒక‌టో రెండో మ్యాచ్‌ల్లో పెద్ద‌గా ప‌రుగులు తీయ‌క‌పోయినా, వికెట్లు తీయ‌క‌పోయినా స‌ద‌రు ప్లేయ‌ర్‌కి వ‌చ్చిన న‌ష్టం  లేదు. మ‌హా అయితే త‌ర్వాతి రెండు  మ్యాచ్‌ల‌ను షామియానా కింద చ‌ల్ల‌బ‌డుతూ చూడ‌మంటారు అంతే.  ఆ త‌ర్వాతా అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా మ‌రీ అదృష్ట‌మే వాడికి. ఎందుకంటే మొత్తం టోర్నీలో పాల్గొన‌డానికి ఇవ్వ‌వ‌ల‌సిన మొత్తం సొమ్ము ఎన్నో కొన్ని కోట్లు చ‌చ్చుకుంటూ స్పాన్సర్లు ఇస్తారు!    ఈ వ్యాపార ఆట స‌ర‌ళితో చిన్న చిన్న సంస్థ‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు ప్ర‌చారం మాత్రం బాగానే చేసుకో గ‌ల్గుతున్నారు.  ల‌క్ష‌లు పెట్టి యాడ్స్ రూపంలో అంద‌రి ముందు క‌న‌ప‌డితే వ‌చ్చేదానికంటే, ఈ టోర్నీలో  వారి సంస్థ‌ల పేరు మాటి మాటికీ క‌నిపించి, వినిపించే ప్ర‌చార హోరు ప‌సిడి కుండ‌ల్ని అమాంతం అందిస్తుండ‌వ‌చ్చు అనే అభిప్రాయాలూ లేక‌పోలేదు. 

     ఒక్క ఆట‌తో వంద‌ల‌ మంది లక్షాధికారులు, కోటీశ్వ‌రులూ  కావ‌డం అనేది ఈ  రోజుల్లో చూడ‌గ‌ల్గుతున్నాం.  ఇందుకు ప్ర‌భుత్వాలూ మ‌ద్ద‌తునిస్తున్నాయి. రాజ‌కీయ‌ నాయ‌కులు, పోనీ వారి బంధువ‌ర్గ‌మో ఆయా స్పాన్సార్ల‌లో భాగ‌మ‌వుతున్నారు. అస‌లు క్రికెట్ పాల‌క‌ మండ‌లిలోనే రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులను స‌భ్యులుగా చూస్తున్నాం. ఇది రాజ‌కీయంగా త‌మ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. 

     మ‌న దేశంలో దుర‌దృష్ట‌మేమంటే,  హాకీని, ఫుట్‌బాల్‌ని అంత‌గా ప్రోత్స‌హించ‌లేక‌పోవ‌డం.  పైకి ఏదో క‌థ‌లు చెప్ప‌డం, ప్ర‌చారం చేయ‌డం,  ఒక‌టి రెండు టోర్నీల‌కు పెద్ద స్థాయిలో హ‌డావుడి చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి మ‌ద్ద‌తు నీయ‌డం అనేది  చాలా అయిష్టంగానే జ‌రుగుతోంది.  క్రికెట్ వేడితో  కొన్ని కుటుంబాలే  బాగుప‌డుతున్నాయి. చాలామ‌టుకు ఆర్ధికంగా చితికిపోతున్నాయి.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.