Publish Date:Jun 19, 2022
మంచి సంబంధం చూసి పిల్లలకు పెళ్లి చేయడం, రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా వుండడం అనేది అందరం కోరుకుంటాం. కానీ అనేకానేక కారణాల వల్ల పోనీ దురదృష్టవశాత్తూ విడాకుల వరకూ వస్తే విడిపోవడమే మంచిదనుకుంటున్నారు రెండు కుటుంబాల వారూ. చదువు, మంచి వుద్యోగం, ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఏదో కారణంగా విడిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు సాధ్యమయినంతవరకూ రెండు కుటుంబాలూ ఆ విపత్తు నుంచి బయటపడాలనే అనుకుంటాయి.
మొన్నటివరకూ అయితే ఇలా తప్పని స్థితిలో విడిపోవడం సజావుగానే జరిగిపోయింది. విడిపోయినపుడు స్నేహపూర్వకంగానే విడిపోయిన కుటుంబాలూ వున్నాయి. అయితే తీసుకున్న వరకట్నం డిమాండ్ చేయడమన్నది ఎప్పూడూ ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కానీ చిత్రంగా మొన్నీమధ్యనే బెంగుళూరుకి చెందిన మహిళ వరకట్నంగా ఇచ్చిన సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు డిమాండ్ చేసి కోర్టు ద్వారా పొందింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయి కుటుంబంవారు పెళ్లి సమయంలో తీసుకున్న 9 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా తిరిగి ఇచ్చేయాలని తీర్పు నిచ్చింది.
విషయమేమంటే ముంబైకి చెందిన ఓ అబ్బాయి 1998లో బెంగుళూరుకి చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. 2001 లో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్ 10 ఇద్దరూ విడాకుల కోసం ముంబై హైకోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 4 లక్షలు జీవభృతిగా ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. వరకట్నం డబ్బు, పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇవ్వమని అమ్మాయి వాళ్లు అడిగితే అబ్బాయి కుటుంబం వారు తిరస్కరించేరు. దీంతో అమ్మాయి కుటుంబంవారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం కేసు పూర్వా పరాలు విన్న తర్వాత అబ్బాయి కుటుంబం వరకట్నం డబ్బుతో పాటు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి అమ్మాయి కుటుం బానికి ఇచ్చేయాల్సిందే అని తీర్పునిచ్చింది.
మరంచేత ఇక మగ పెళ్లివారు చాలా జాగ్రత్త పడాల్సి వుంటుదేమో! పిల్లడు పిల్లతో కడు జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం విభే దించినా, కొట్టడాలు, తిట్టడాలు అతిగా చేసినా కేసు అయి కోర్టుదాకా వెళితే ఇచ్చినదంతా కక్కాల్సి వస్తుంది. బహుపరాక్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-orders-to-give-back-dowry-39-137963.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.