Publish Date:Sep 11, 2022
ఎవరిమీదయినా కక్ష తీర్చుకోవాలంటే కుట్రపన్ని కొట్టించడం, కేవలం ఆస్పత్రి లో చేరేలాగా చేయడమే చేసి ఆనందించడం గమనిస్తుంటాం. కానీ సినిమాటిక్ గా కొట్టినట్టు సీన్ క్రియేట్ చేసి మరీ పోలీసు కేసు, జైల్లో పెట్టించడాలు కూడా చేయవచ్చని నరసరావుపేట సంఘటన తెలియజేసింది. ఏకంగా న్యాయమూర్తే ఆశ్చర్యపడేలా జరిగింది.
రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో గత నెల 27న గంగినేని పున్నయ్య అనే వ్యక్తి తనపై గొడ్డలితో దాడిచేశాడని అదే గ్రామా నికి చెందిన తురిమెల్ల చెంచారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పున్నయ్యమీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
నరసరావుపేట ప్రభుత్వఆస్పత్రిలో చెంచారావు చికిత్స పొందారు. తీవ్రగాయాలు అయినట్టు ఆ ఆస్ప్రతి వైద్యుడు రాజశేఖర్ రిపోర్టు కూడా ఇచ్చారు. వినడానికి ఇదంతా బాగానే ఉంది. ఇదంతా నిజమే అయ్యో ఎంతగా గాయపడ్డాడో చెంచారావు అను కున్నారంతా. డాక్టర్గారి నివేదిక అంతలా ప్రభావం చూపిందిమరి.
శనివారం చెంచారావు కేసు కోర్టుకి వచ్చింది. చెంచారావు దెబ్బలను జడ్జి స్వయంగా పరిశీలించాలనుకున్నారు. చిత్రమేమంటే ఆయనకు చెంచారావు ఒంటి మీద ఒక్క గాయం కనిపించకపోవడం. అసలు కత్తిపోట్లు ఎక్కడున్నాయి, చిన్న గాయం కూడా లేని మనిషికి తీవ్రగాయాలకు చికిత్స చేశామంటూ డాక్టరు రిపోర్టు ఇవ్వడమేమిటని జడ్జిగారు ఆశ్చర్యపడ్డారు. నిందితుడుకి బెయిల్ రాకుండా కావాలనే తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు ధ్రువీకరించుకున్న జడ్జి వెంటనే పున్నయ్య కి బెయిల్ మంజూరు చేశారు. జరిగిన ఘటనపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని డీఎస్పీ కి, ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ కి నోటీసులు ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-notices-issued-on-narasaraopet-dsp-25-143542.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.