Publish Date:Mar 17, 2023
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండగా ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది.
కస్టడీ పొడిగించాల్సిందిగా కోరింది. కోర్టు ఆయనను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టు కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మద్యం కుంభకోణంలో సిసోడియాను ఈడీ ఈ నెల 9న ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా ఇదే కేసులో సీబీఐ మనీష్ సిసోడియాను గత నెల 26న అరెస్టు చేసింది.
అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-extends-sisodia-ed-custody-25-152645.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.