Publish Date:Nov 29, 2024
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కడప జిల్లాలో అంతా తానై వ్యవహరించిన వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం అండతో జిల్లాలో సర్వ వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకుని ఆడింది ఆటగా పాడింది పాటగా చెలాయించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు సొంత మనుషులను కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరారు.
అసలే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి ఏ క్షణంలో ఆ బెయిలు రద్దౌతుందా అన్న భయంతో వణికి పోతుంటే పుండు మీద కారంలా తన పీఏ రాఘవరెడ్డిపై కేసులు నమోదు కావడం, ఆయన పారారీలో ఉండటం, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే పరిస్థితుల్లో ఉండటంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాఘవరెడ్డి పోలీసులకు చిక్కితే వైఎస్ వివేకా హత్య కేసుతో పాటు మరిన్ని కేసులు తన మెడకు చుట్టుకోవడం ఖాయమని వివేకా కంగారు పడుతున్నారు. తాజాగా రాఘవరెడ్డి కడప కోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఏ కలుగులో దాగున్నా రాఘవరెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని పోలీసులు అంటున్నారు.
అసలు ఇంతకీ అవినాష్ పీఏ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? ఆయన ఏ కేసులో అరెస్టునుంచి రక్షణ కోరుతూ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారూ అంటూ.. సామాజిక మాధ్యమంలో అసభ్య పోస్టుల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి విచారణలో వెల్లడించిన కీలక అంశాల ఆధారంగా పోలీసులు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు. రాఘవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేవాడినని వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు ఆరంభించారు. ఇప్పుడు రాఘవరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను కడప కోర్టు తోసిపుచ్చడంతో ఏ క్షణంలోనైనా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
రాఘవరెడ్డి అరెస్టైతే అవినాష్ రెడ్డి గుట్టు రట్టైనట్లేనని అంటున్నారు. దీంతో రాఘవరెడ్డి బెయిలు పిటిషన్ ను కొట్టివేయడం అవినాష్ కు షాకేనని అంటున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో పీకల్లోతు ఇరుక్కుని ఉన్న అవినాష్ రెడ్డిపై ఇక సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలోనూ ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న ఆయన బెయిలును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం తాజాగా భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సుదీర్ఖ కాలంగా నత్తనడకన నడుస్తున్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణ ఇక వేగం పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డి అరెస్టైతే ఇక అవినాష్ రెడ్డి చక్రబంధంలో ఇరుక్కున్నట్లేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-dismiss-raghavareddy-anticipatory-bail-25-189198.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.