రూ.500ల దొంగనోట్లు.. ఎలా గుర్తించగలమంటే?

Publish Date:Jan 6, 2025

Advertisement

దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు. సరిగ్గా ఆ ఆ రోజు నుంచి రెండు నెలల పాటు దేశంలోని ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలలో నిబబడి కొద్ది మొత్తం తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే రోజు వారీ కార్యక్రమంగా మారిపోయింది. రోజు వారీ అవసరాలకు కూడా సొమ్ములు లేక జనం నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా దేశంలో నల్లధనం లేకుండా పోతుంది, ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పడతా యన్న ఆశతో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు.

అయితే నల్లధనం లేకుండా చేయాలన్న మోడీ ఉద్దేశం పెద్ద నోట్ల రద్దుతో ఎంత వరకూ నెరవేరిందో తెలియదు కానీ, పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా దేశంలో దొంగనోట్ల చెలామణి యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా ఇప్పుడు భారత కరెన్సీలో అత్యధికంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లలో అసలు నోటేదో, నకిలీ ఏదో గుర్తుపట్టడం దాదాపు అసాధ్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి.  పెద్ద మొత్తంలో రూ.500  నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లలో అసలేదీ, నకిలీ ఏదీ అని గుర్తుపట్టడం కష్ట సాధ్యంగా ఉందని బ్యాంకులే చెబుతున్నాయి. అంత పకడ్బందీగా నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని అంటున్నారు.  రూ.500ల నోట్లలో  అసలుకూ నకిలీకీ తేడా ఏమిటో సామాన్యలు గుర్తించడం చాలా చాలా కష్టమని అంటున్నారు. అయితే అసలులో రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో ఆ స్పెల్లింగ్ చిన్న తప్పు ఉందనీ, అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోవడానికి అదో మార్గమనీ చెబుతున్నారు.

అసలు నోటులో రిజర్వ్ బ్యాంకు అన్న స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో రిజర్వ్ బ్యాంకు స్పెల్లింగ్ ఆర్ఇఎస్ఏఆర్ విఇ అని ఉంటుందని చెబుతున్నారు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న భారత్ లో ఈ తేడాను గుర్తించగలిగేది ఎందరు? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా దేశంలో నకిలీ నోట్లు ఏ మాత్రం తగ్గలేదనీ, నోట్ల రద్దుతో మోడీ సాధించిందేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.