Publish Date:Dec 31, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫొటోల పిచ్చి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది ఆయన అధికారంలో ఉండగా పీక్స్ కు చేరింది. వైసీపీ నేతలే ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని అప్పట్లో తమలో తాము గుసగుసలాడుకేనే వారు. వైసీపీ పరాజయం తరువాత ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా పలు సందర్భాలలో చెప్పారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జగన్ బొమ్మలతో రెవెన్యూ, సర్వే శాఖలు భారీ ఫోటో ఎగ్జిబిషన్ చేశాయి.
అన్నిటి కంటే విచిత్రమేమంటే ఎల్పీఎం రికార్డుల్లోనూ ఆయన ముఖ చిత్రం ముద్రించు కున్నారు.చివరాఖరకు సర్వే రాళ్లపై సైతం జగన్ బొమ్మ పెట్టుకున్నారంటే ఆయన పిచ్చి ఏ స్థాయిలో ఉండేదో ఎవరికైనా అవగతమౌతుంది. జగన్ ఫొటోల పిచ్చి కూడా ప్రజలలో ఆయన ప్రతిష్ఠ దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. చివరాఖరుకు పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా జగన్ ఫొటో ఉండటంతో జనం తీవ్రంగా ఏవగించుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన జగన్ సతీమణి భారతిని ఓటర్లు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ నిలదీశారు. సరే జగన్ పార్టీ పరాజయం పాలైంది. అధికారాన్ని కోల్పోయింది. గత ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సర్వే రాళ్ల నుంచి, పట్టాదారు పాసు పుస్తకాల వరకూ జగన్ ఫొటోలను తీసేయడానికి బోలెడంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా విడుదల చేసే వార్షిక క్యాలెండర్ పై కూడా 2019-24 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రం మస్ట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. క్యాలెండర్‌లోని ప్రతి పేజీలో జగన్ ఫోటో నవరత్నాల లోగోలు ఉండేవి. ఆ ఐదేళ్లూ రాష్ట్ర ప్రభుత్వ వార్షిక క్యాలెండర్లు జగన్ ఫొటో ఎగ్జిబిషన్ లా ఉండేవి తప్ప క్యాలెండర్ గా ఉండేవి కావు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2025 వార్షిక క్యాలెండర్ లో జగన్ ఆరంభించిన సంప్రదాయానికి ముగింపు పలకడమే కాకుండా, వినూత్నంగా, హుందాగా వర్తమాన రాజకీయ నాయకుల ఫొటోలకు తావే లేకుండా చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తాజాగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ లో స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి. ఐదు సంవత్సరాలుగా జగన్ బొమ్మతో రోత పుట్టించిన ప్రభుత్వ వార్షిక క్యాలెండర్ ఇప్పుడు స్ఫూర్తిదాయక నేతల ఫొటోలతో విడుదల కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/correct-retard-to-jagan-photoo-mania-39-190586.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.