మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది!

Publish Date:Apr 12, 2023

Advertisement

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో గత 24 గంటలలో  5 వేల 676 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 3 వేల 761 మంది కొవిడ్  నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 37 వేల 93  యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.

కాగా జాతీయ కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220 కోట్ల 66 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే బుధవారం నాటికి 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,830 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడేనని వివరించారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరిందని వివరించారు. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు బయటపడ్డాయని తెలిపారు. ఇక రోజువారీ పాజిటివిటీ   విషయానికి వస్తే మంగళవారం నాటికి ఇది 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరింది.  వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు.  వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. రాష్ట్రాల్లో చూస్తే.. కేరళలో అత్యధికంగా 13,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (4,667), ఢిల్లీ (2,338), తమిళనాడు (2,099), గుజరాత్ (1932), హర్యానా (1928), కర్ణాటక (1673), ఉత్తరప్రదేశ్ (1282) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1000 కంటె తక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో ఇండియాలో కరోనా వల్ల 15 మంది చనిపోయారు. వారిలో ఢిల్లీలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కేరళలో ఇద్దరు చనిపోగా... గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన కరోనా మాక్ డ్రిల్‌ను సమీక్షించారు. ఢిల్లీలోని RML ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. మాక్ డ్రిల్ ఇవాళ కూడా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ప్రిపరేషన్ ఎలా ఉందో ఇందులో గమనిస్తారు. తద్వారా కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తే.. ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఎక్స్ బిబి.1.16 అనే వేరియంట్ కారణంగా కనిపిస్తోంది. ఇది గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రాణాంతకమైనది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఐతే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.