కరోనా కాషన్.. జాగ్రత్తలు తప్పని సరి

Publish Date:Apr 4, 2023

Advertisement

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. 2019 నాటి పరిస్థితి మళ్లీ పునరావృతమౌతుందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో రోజు వారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అదే సమయంలో మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తొలి నుంచీ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? పాజిటివిటీ రేటు ఎలా ఉంది? రికవరీ రేటు అంటూ ప్రకటనలు గుప్పించడంతో సరిపెట్టకుండా కోవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి విజృంభణపై అప్రమత్తమైన కేంద్రం కేవలం సూచనలు, హెచ్చరికలకే పరిమితమౌతోంది. ఇదే వ్యాప్తి తీవ్రత కొనసాగితే.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పవేమోనన్న ఆందోళనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది కనుక అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోందన్న మాట అయితే వాస్తవమని అందరూ అంగీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే కరోనా డేంజర్ బెల్స్ మెగాయి.  అప్పట్లోనే అధికార వర్గాలు, వైద్య నిపుణులు కోవిడ్ జాగ్రత్తలు కొనసాగించడం తప్పని సరి అని  హెచ్చరికలు జారీ చేశాయి.

 కేసుల  పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా కోవిడ్ కేసుల విజృంభణ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అప్రమత్తమైంది. థియోటర్లలో మాస్కులను తప్పని సరి చేసింది.

మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమై కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా థియోటర్లు, కార్యాలయాలలో ఏసీల కింద కూర్చుని పని చేసే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు పెద్ద పీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలి. 

By
en-us Political News

  
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది.
ప్రధాని కావాలనుకోవడం తప్పా.. ప్రణబ్ కుమార్తె కౌంటర్.! 
ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం
వీసీ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.!
టెక్నాలజీ రంగంలో యువత తమ సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.