సభలో రాజ్యాంగ సవరణ బిల్లు.. విపక్షాల నిరసన

Publish Date:Apr 16, 2026

Advertisement

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.  

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు.  నారీ శక్తి వందన్ అధినియమ్  ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.   2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.

ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి   850కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.   మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ   డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రను సహించబోమని చెబుతున్నాయి. 

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇలా ఉండగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే.. సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లోక్ షభలో కనీసం 360 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్డీయే కూటమికి సభలో ఉన్న బలం 292 మాత్రమే కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.