ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ జూమ్ సమావేశం

Publish Date:Jun 14, 2026

Advertisement

 

ఓటర్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్ఏల బాధ్యతలపై కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని అరగంట చొప్పున మొత్తం ఆరు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, బీఎల్ఏలు చేపట్టాల్సిన చర్యలు, బీఎల్‌ఓల పనితీరుపై నిఘా, ఓటర్ల జాబితాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తైందనే అంశాన్ని సమీక్షించారు. ఇంకా మ్యాపింగ్‌లో చేరని, ఓటు హక్కు కోల్పోయిన అర్హులను గుర్తించి వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే విధానంపై వివరించారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఈఆర్ పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలు ఓటర్ మ్యాపింగ్‌ను లోతుగా పరిశీలించి ప్రతి అర్హ ఓటును కాపాడాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఓటు తొలగింపునకు గురైతే వెంటనే ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేసి పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి ఓటు కీలకమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకత్వం స్పష్టం చేసింది.

ఈ జూమ్ సమావేశాలకు గంప వేణుగోపాల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశాలను టీపీసీసీ ఎలెక్షన్ కమిషన్ చైర్మన్ రాజేష్ వివరించారు.

ఇప్పటివరకు సుమారు 90 శాతం బీఎల్ఏ శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్ఏ-2 ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటర్ ధృవీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తూ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలతో సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.