కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

Publish Date:May 2, 2023

Advertisement

కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తేలింది. రెండో స్థానంలో బీజేపీ, మూడోస్థానంలో జెడీ(ఎస్) ఉంది. అయితే జేడీఎస్ ముఖ్య భూమిక వహించనుంది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం.కన్నడ మీడియా సంస్థ ఎడీనా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు రానున్నాయి. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు రానుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోనుందని ఎడీనా పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224. అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలవనుంది. 57 నుంచి 65 స్థానాల్లో ఆ పార్టీ గెలవనుందని సర్వే తెలియజేసింది. జనతాదళ్ (ఎస్) కింగ్ మేకర్ గా అవతరించనుంది. కింగ్ మేకర్ అయినప్పటికీ ఆ పార్టీకి 19  నుంచి 25 స్థానాలు రానున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారిగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ కర్ణాటక(31 నుంచి 37 స్థానాలు), ముంబయ్ కర్ణాటక (40 నుంచి 46), సదరన్ కర్ణాటక(26 నుంచి 32 ), బెంగుళూరు(16 నుంచి 20) స్థానాలు ఉన్నాయి. బిజేపీ హైదరాబాద్ కర్ణాటక(2 నుంచి 4)స్థానాలు, కోస్తా కర్ణాటక(10నుంచి 14 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక ( 19 నుంచి 23 ) స్థానాలు కైవసం చేసుకోనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని సర్వే రిపోర్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మరో 100 ఏళ్ల వరకు అధికారంలో రాదని జోస్యం చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి కర్ణాటకలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని తూమకూరు అసెంబ్లీనియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు. అవినీతి, అసమర్ధత నియోజకవర్గంలో రాజ్యమేలుతుందని బిశ్వాస్ చెప్పారు. ఇక్కడ 342 గ్రామాల్లో తాగునీరు, రోడ్ల  సౌకర్యం లేదు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఎడీనా సంస్థ  సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రేస్ మెజారిటీ స్థానాల్లో గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి ఖాయమని  ఘంటాపథంగా చెబుతోంది. ఇదిలా వుండగా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రేస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడతాయని ఏసియా న్యూస్ జన్ కీ బాత్  ఓపినియన్ పోల్  జోస్యం తెలియజేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 11 వరకు 30 వేల మంది ఓటర్లను సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది. కోస్తా కర్ణాటకలో అధికార పార్టీ పట్టు బిగుస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ  పరిస్థితి బాగా లేదు. 

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.