కాంగ్రెస్ షర్మిల నామస్మరణ.. ఎందుకంటే?!

Publish Date:Jul 10, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. బలమైన నేతలను అంతే బలంగా తమ వైపుకు లాగేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని భావిస్తున్నది. అందుకోసం ఎన్నో రకాల ప్రణాళికలు రచించుకుంటుంది. ఈ క్రమంలో చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ నేతగానే మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. వైఎస్ వారసులుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయాలలో ఉండగా.. జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు దూరమై పూర్తిగా ఏపీ రాజకీయాలలోనే ఉన్నారు. ఇక షర్మిల అన్నతో విభేదించి తెలంగాణకు వచ్చేసి తండ్రి పేరిటనే కొత్త పార్టీ పెట్టారు. అయితే, వైఎస్ఆర్టీపీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణకు నోచుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ షర్మిలను తనలో కలుపుకొని వైఎస్ఆర్ బ్రాండ్ దక్కించుకోవాలని చూస్తుంది.

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పటికే షర్మిలతో సంప్రదింపులు జరపగా.. షర్మిల పార్టీ విలీనానికి సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో బలమైన సమాచారం ఉంది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెల్లి షర్మిల కోసమే అన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా వైఎస్ జయంతి రోజున రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు సైతం షర్మిల రీట్వీట్ చేసి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు. మీ హృదయంలో వైఎస్ఆర్ కు ఇంకా స్థానం ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ షర్మిల రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన రీట్వీట్ జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు మరింత క్లారిటీ ఇచ్చింది. ఇక షర్మిల పార్టీ విలీనం తర్వాత ఏపీకి వెళ్తారా తెలంగాణలో ఉంటారా అన్నదానిపై కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే  షర్మిల ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడం ఖాయమంటున్నారు.

కాగా అసలు కాంగ్రెస్ పార్టీ షర్మిల కోసం ఇంత ఆరాటానికి కారణం ఏంటన్నది చూస్తే వైఎస్ఆర్ లెగసీ కోసమే అని చెప్పుకోవాలి. వైఎస్సార్ సర్కార్ పైఅవినీతి ఆరోపణలు, కక్ష్యపూరిత రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన సంక్షేమ పథకాలతో ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణలో సైతం ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులుగా ఎందరో నేతలు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు వైఎస్ బిడ్డగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే ఎన్టీఆర్ లెగసీ కోసం బీజేపీ పురందేశ్వరిని ఏపీకి అధక్షురాలిని చేయగా..  కాంగ్రెస్ షర్మిల ద్వారా మళ్ళీ వైఎస్ఆర్ ను ప్రజలకు గుర్తు చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు షర్మిలకు సైతం కాంగ్రెస్ లో ఇమిడిపోయేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులూ కాంగ్రెస్ తోనే ఆయన ప్రయాణం సాగింది. పైగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే తన అభిమతమని ఆయన అప్పట్లో ఎప్పుడూ చెప్పేవారు.  సోనియాను ప్రధానిగా చూడాలని ఉన్నా ఆ అవకాశం రాలేదని.. కానీ రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఉందని వైఎస్ఆర్ చెప్పేవారు. ఇప్పుడు ఆయన కలను సాకారం చేసేందుకు.. ఆయన ప్రజా సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో మరో ప్రయాణం మొదలు పెట్టినట్లు చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం ఉంది. మరి షర్మిల కాంగ్రెస్ చేరిక ఎప్పుడో ఇక వేచి చూడాలి.

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.