తండ్రి బ్రాండ్ కొడుకుదా.. కూతురిదా?

Publish Date:Jun 20, 2023

Advertisement

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు  కాంగ్రెస్  రాజకీయాలు జగన్ పరువు తీస్తున్నాయి. ఇప్పటికే రెండుగా చీలిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం తాజా పరిణామాలతో మరింత ఇరకాటంలో పడింది. తెలంగాణలో వైఎస్ఆర్  పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న షర్మిల ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుండటంతో  జగన్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తల్లి, చెల్లెళ్లను విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాజకీయాల వైపు నెట్టేసి , తనకు తిరుగులేదని ఊపిరి పీల్చుకుంటున్న జగన్  తాజా పరిణామాలతో  అవాక్కయ్యారు.  

కాంగ్రెస్ మూలాల నుండి వచ్చిన  రాజశేఖర రెడ్డి  కుటుంబాన్ని తిరిగి కాంగ్రెస్ నీడన చేర్చేందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు.  జులై 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపుల పాయలోని ఆయన సమాధిని సందర్శించాలని  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న  నేపథ్యంలో జులై 8న ఇడుపుల పాయ కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేలా అంగీకరింపచేయడంలో వెనుక ఉండి కథ నడిపింది.. వైఎస్సార్ ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రారెడ్డి తన వంతు ప్రయత్నం చేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద తన పలుకుబడిని ఉపయోంగించి వారి నుంచి అభ్యంతరాలు రాకుండా మంతనాలు, మంత్రాంగం నెరిపారు.

ఆ తరువాత కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిలకు కాంగ్రెస్ ద్వారాలు తెరిచేలా చేశారు. అన్నిటికీ మించి తాను టీపీసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల రాజకీయాలు చేయలేరని ప్రకటించిన రేవంత్ రెడ్డిని కూడా ఒప్పించారు. తద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి తమ బ్రాండ్ అని నమ్ముతున్న  కాంగ్రెస్ ఈ అంశాన్ని రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సమర్ధవంతంగా ప్రచారంలో పెట్టాలని భావిస్తోంది. వైఎస్ఆర్ బ్రాండ్ తనదే అంటూ ప్రతీ పథకానికి  ఆయన పేరు తగిలించి ప్రచారం చేసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది ఎంతమాత్రం మింగుడు పడని విషయం. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మంచి జోష్ లో ఉండడం,   కర్నాటక  మోడల్ ను తెలంగాణలో అనుసరించేందుకు వ్యూహాలు రచించడం ఒక ఎత్తు అయితే పదేళ్ల కెసీఆర్ పాలనపై నాయకులలో ప్రజల్లో ఉన్న అసహనాన్నిఓట్లుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. 

వైఎస్ షర్మిల వంటి నాయకురాలిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక్క తాటిపై తెచ్చేందుకు  కాంగ్రెస్  అధిష్టానం చేస్తున్న విలీన ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే.  మరో వైపు నాయకులు ఎక్కువగా ఉండే  కాంగ్రెస్ లో పదవుల పంపకం రేపు పెద్ద సమస్య కాక మానదు. షర్మిల పార్టీని విలీనం చేసుకుని బిఆర్ఎస్ కు బిజెపికి గట్టి సవాల్ విసిరాలని  కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు మరిన్ని పార్టీలు తమ మద్దతును  కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టిపి విలీనం ఇటు తెలంగాణ రాజకీయాలనే కాక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను  కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.