కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్

Publish Date:Nov 19, 2022

Advertisement

మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. మాజీ మంత్రి, కేంద్ర   విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.   కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రిమర్రి శశిథర్ రెడ్డి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకున్న సంగతి విదితమే.

  బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణల తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రిశశిధర్ రెడ్డి నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. అంతకు ముందు మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.  కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన, ఢిల్లీ వెళ్లినంత మాత్రానా హోంమంత్రిని కలిసినంత మాత్రానా పార్టీ మారుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. అయితే జరుగుతున్న పరిణామాలను గమనించి ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్.. ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సస్పెన్ష్ వేటు వేసింది.

కాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామం దుమారాన్ని లేపింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ పరిణామాలపై స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డిపై వేటుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే అందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  బాధ్యత వహించాలన్నారు.  మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

జూమ్ మీటింగ్ లు పెట్టి కులాసా కబుర్లు చేప్పుకోవడమేమిటని మండి పడ్డారు.  కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనన్నారు.  అందుకే మర్రి శశిధర్ రెడ్డి ఇబ్బంది పడి ఉంటారని చెప్పారు. ఆయనతో పార్టీ నాయకత్వం మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

By
en-us Political News

  
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.