రద్దైన కరెన్సీలా కాంగ్రెస్..!
Publish Date:Jun 20, 2022
Advertisement
చాలాకాలం నిరుపయోగంగా వున్న వస్తువుల్ని పారేస్తాం. దేశంలో పాతనోట్ల స్థానంలో కొత్త కరెన్సీ నోట్లు వచ్చాయి. పాత నోట్లు ఇప్పుడు చెల్లవు. చిత్తు కాగితాలతో సమానం. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పుడు అది చెల్లని నోటు. చాలాకాలం అధికారంలో వుండి అన్ని ప్రాంతాలూ సమాంతరంగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేయాల్సిన బాధ్యతను కాంగ్రెస్ విస్మరించడం వల్లే ఈ పరిస్థితికి ఆ పార్టీ చేరుకుంది. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే వుందని, చాలా కాలం అధికారంలో వున్న, పురాతన పార్టీ కేవలం ప్రచారానికి, ఆర్భాటాలకే పాలనా కాలం వెచ్చించింది. ఈశాన్య రాష్ట్రాలకు అందుకే కాంగ్రెస్ పై మండిపాటు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా వెనకంజలో వుండ డం గురించి అనేక సందర్భాల్లో అనేకమంది రాజకీయనాయకులు విమర్శిస్తూనే వున్నారు. ఈ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి కాంగ్రెస్ ఎన్నడూ పెట్టలేదని, కేవలం ఓట్లు అధికారం కోసం ఆకట్టుకునే ప్రచారాలు, ప్రసంగాలు తప్ప వాస్తవంగా చేసిందేమి లేదని అక్కడి ప్రజలు చెబుతూనే వున్నారు. ఇపుడు తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీ పాత కరెన్సీనోట్ల వంటిదని ఎద్దేవా చేయడం గమనార్హం. అధికారంలో వున్ననాళ్లు కనీసం రాజధాని ఎక్స్‌ప్రెస్ కోరికను కూడా అంగీకరించ లేదని ఘాటుగా విమర్శించడం ఆ ప్రాంత ప్రజల మనోభావాన్ని వ్యక్తం చేస్తుంది. అసలు ఆ పార్టీని ప్రజలు ముట్టడానికి ఇష్టపడని పాత నోట్లుగా మారిపోయిందని, ఆ పార్టీ నిరుపయోగంగా మారిందని బిశ్వశర్మ ఆదివారం అగర్తలా ఉప ఎన్నిక ల ప్రచార సభలో మాట్లాడారు. ఏమాత్రం అభివృ ద్ధిని చేపట్టని కాంగ్రెస్ పాలనన ఒక్క ఈశాన్య రాష్ట్ర పరిస్థితిని చూస్తే తెలుస్తుందని దుయ్యబట్టారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి సుదీప్ రాయ్ బర్మన్ పై బిజెపి అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ సిన్హా ను ఆ పార్టీ నిలబెట్టింది. ఈ ప్రాంతంలో అసలు కాంగ్రెస్ 2014 నుంచీ ప్రతీ ఎన్నికల్లోనూ ఓటమినే చవి చూసింది. అందుక్కారణం పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పూర్తిగా తగ్గడమేనని ఈశాన్య ప్రజాస్వామిక కూట మి (ఎన్ ఇ డి ఏ) నాయకలు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి విజయాలతో పోలిస్తే సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కి ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పరా జయమే దక్కిందనేది సీ.ఎం. బిశ్వ శర్మ తన ప్రసంగంలో మరో సారి గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/congress-situation-like-old-currency-after-demonitisation-25-138018.html





