ఏపీలో కాంగి‘రేసు’.. పలు నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి వైసీపీ?

Publish Date:Apr 10, 2024

Advertisement

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ వైసీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు వెలువడటం మొదలైన తరువాత ఆ విశ్లేషణలు అక్షరసత్యాలని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు మొత్తం వైసీపీకి వెళ్లి పోయింది. ఈ పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి మాత్రంగా మిగిలిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఆ ఓటు అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లి పోతుందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి.

షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ఆ పార్టీలో ఆ జోష్ కనిపించినా ఆ తరువాత ఆ ప్రభావం పెద్దగా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అనుకున్న స్థాయిలో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు లేకపోవడం కూడా అందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా షర్మిల నేరుగా జనగ్ ను ఉద్దేశించి, పేరు పెట్టి మరీ విమర్శలు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైంది. ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తరువాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఆమె ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్ని, కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, మాజీ మంత్రి శమంతకమణి వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి ఆయా జిల్లాలలో, ప్రాంతాలలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా వీరు వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ నుంచి తమ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి పార్టీకి బదలాయించుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతోందన్న సంకేతాలను పంపించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వ్యూహాత్మకంగా, వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కీలకమైన నియోజకవర్గాలలో  బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సంప్రదాయ ఓటు బ్యాంకు మళ్లీ పార్టీకి చేరువకావడానికి ఢోకా లేని పరిస్థితులు ఆయా నియోజకవర్గాలలో నెలకొన్నాయి. కడప లోక్ సభ నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా షర్మిల నిలబడటంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి హంతకుడికి పార్టీ టికెట్ ఇచ్చిన సీఎం జగన్ వైఎస్సార్ వారసుడెలా అవుతారంటూ షర్మిల సూటిగా సంధిస్తున్న ప్రశ్న కడప వాసులను కదిలిస్తోంది. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ ఖరారై  ఆమె ప్రచారం ప్రారంభించిన  తరువాత నుంచీ స్థానికంగా వెలువడిన పలు సర్వేలు అక్కడ షర్మిల దూసుకుపోతున్నట్లు తేల్చేశాయి. ఆమెకు దాదాపు 50శాతం మంది జనం మద్దతుగా నిలుస్తున్నారంటూ అంచనాలు వెలువడ్డాయి.

అలాగే తిరుపతి నుంచి చింతా మోహన్, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ  నుంచి  మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు వంటి అభ్యర్థులు రంగంలోకి దిగడంతో  ఆయా లోక్ సభ నియోజకవర్గాలలోనే కాకుండా ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ బలంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా  పూతలపట్టు, గంగాధర  నెల్లూరు నియోజకవర్గాల  అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా కాంగ్రెస్ అత్యంత వ్యూహాత్మకంగా వైసీపీ అవకాశాలను గండి కొట్టిందని అంటున్నారు.  గతంలో  వైపీపీ అభ్యర్థిగా పూతలపట్టు నుంచి విజయం సాధించిన ఎంఎస్ బాబుకు  అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ద్వారా.. ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఆశలను కాంగ్రెస్ ఆవిరి చేసేసింొదని అంటున్నారు.   వైఎసీపీ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబును కాదని   సునీల్‌కుమార్‌ను బరిలోకి దించిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకూ రెండు జాబితాలను విడుదల చేసింది. రానున్న రోజులలో మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయనుంది. మొత్తం మీద కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం అంటే వైసీపీ బలహీనం కావడమేనన్న పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకూ తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ బలంగా పుంజుకున్న పలు నియోజకవర్గాలలో ప్రధాన పోటీ తెలుగుదేశం కూటమి, కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ కాంగ్రెస్ కారణంగా భారీగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. 

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.