Publish Date:Apr 27, 2022
దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, స్వాతంత్ర్య సంగ్రామంలో ముందు పీఠిన నిలిచిన పార్టీ..దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ....దాదాపు 5 దశాబ్దాలు దేశ రాజకీయాలనుశాశించిన పార్టీ.. వందేళ్లకుకు పైబడిన చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరువు ఒక్క ట్వీట్..ఒకే ఒక్క ట్వీట్తో గంగలో నిండా మునిగింది. ఆ ట్వీట్ చేసినది ఎన్నికల వ్యూహకర్తగా ఇటీవల గుర్తింపు పొందిన పీకేఅనబడే ప్రశాంత్ కిశోర్. ఆయన ట్వీట్ వటవృక్షం లాంటి కాంగ్రెస్ కూకటి వేళ్లను వణికించింది. ఇంతకీ ఆయనా ట్వీట్ లో ఏమన్నారంటే...కాంగ్రెస్ కు నాయకుడు కావాలి అని మాత్రమే. ఆ ఒక్క మాట కాంగ్రెస్శ్రేణుల ఇన్నేళ్ల ధీమానూ కకావికళం చేసింది.
ఆ పార్టీ అధినాయకత్వం ఆత్మ విశ్వాసాన్నే దెబ్బ తీసింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆపార్టీకి పరాభవమే ఎదురౌతోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా చేజారి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించింది.పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రూపొందించాలని కోరింది. ఈ క్రమంలోనే ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా ఆ పార్టీ కోర్ నాయకులతో వరసగా భేటీలు జరిపారు. ఇంత
వరకూ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేసేందుకుఏర్పాటు చేసిన సాధికార కమిటీలో భాగమై పని చేయాల్సిందిగా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పీకేను ఆహ్వానించారు. ఇక్కడ వరకూ బానే ఉంది...అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానానికి పీకే స్పందించిన తీరే కాంగ్రెస్ పరువు ప్రతిష్టలను నడి బజార్లో నిలబెట్టేసింది. పార్టీని నవ్వుల పాలు చేసింది. వ్యూహకర్తను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఆ పార్టీ వ్యూహాత్మక వైఫల్యం పార్టీ అధినేత్రి ప్రతిష్టను పలుచన చేసింది.
ఇంతకీ పీకే...సోనియా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ...చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాలే ఆ పార్టీ నాయకత్వాన్ని తలెత్తుకోనీయకుండా చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కావలసింది తన లాంటి వ్యూహ కర్తలు కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగిన సమర్థ నాయకత్వం కావాలని పీకే సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీకి సమర్థ నాయకత్వం లేదనీ సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రికే ట్వీట్ చేశారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కు అంత త్వరగా తేరుకోవడానికి వీలులేని పెద్ద ఎదురు దెబ్బగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధినాయకత్వంపై ధిక్కారం కేవలం జీ-23 బృందానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు అది మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.ఒక వైపు సోనియా గాంధీ, పీకే చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకేను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రకటనలు రావడం, వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తడమే ఇందుకు నిరసనగా వారు చూపుతున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ యేతర కూటమి ఏర్పాట్లు, బీజేపీని దీటుగా ఎదుర్కోవాలన్న కాంగ్రెస్ యత్నాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-prestige-drowned-with-only-one-tweet-25-135097.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.