కాంగ్రెస్ నేతల మాటల మతలబేమిటో

Publish Date:Jan 27, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన అంశాన్నిభుజానికెత్తుకొన్నకాంగ్రెస్ అధిష్టానం, అది తనకెంత భారంగా ఉన్నాకూడా ఇంతవరకు కాడి క్రిందన పడేయకుండా ప్రయాసపడుతూ మోసుకుపోతోంది. అంటే దానర్ధం తెలంగాణా ఏర్పాటు పట్ల దానికెంతో నిబద్దత ఉందని కాదు. ఉన్నట్లు నటిస్తోంది అంతే! బీజేపీ మద్దతు లేనిదే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందదని తెలిసి ఉన్నపటికీ, ప్రతీ కాంగ్రెస్ నాయకుడు కూడా “తెలంగాణా బిల్లును పార్లమెంటులో తప్పకుండా ప్రవేశపెడతాము, ఆమోదింపజేస్తాము” అంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ముహూర్తాలు కూడా తరచు ప్రకటించడం కూడా ఈ జగన్నాటకంలో భాగమే. ఒక అబద్దాన్ని పదిమంది పదిసార్లు పదిమందికి చెపితే నిజమవుతుందన్నట్లు, కాంగ్రెస్ అధిష్టానం తాను స్వయంగా తెలంగాణా ఏర్పాటు చేసే స్థితిలో లేకపోయినా, తెలంగాణా ఏర్పాటు చేస్తానని పదేపదే గట్టిగా చెపుతుండటం వలన, కాంగ్రెస్ నిజంగానే చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉంది. భావిస్తున్నారు కూడా. అందుకు టీ-కాంగ్రెస్ నేతలు కూడా “తెలంగాణా ఇచ్చేది తెచ్చేది తామేనంటూ”, కాంగ్రెస్ అధిష్టానానికి (ఉడతా) భక్తిగా పక్కవాయిద్యాలు వాయిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు.

 

అందువల్ల బీజేపీ పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడేందుకు కాంగ్రెస్ చాలా ముందు నుండే ఈ వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ ఏ కారణంగానయినా పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందలేకపోయినా కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీని చూసి తెలంగాణా ప్రజలు “తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పాపం! చాలా నిజాయితీగా చాలా గట్టిగానే కృషిచేసింది. కానీ, ఆ దుష్ట బీజేపీ మద్దతు ఈయకపోతే తను మాత్రం ఏమి చేయగలదు పోనీలే పాపం!” అని క్షమించి ఓట్లేస్తారని కాంగ్రెస్ (దురా)లోచన.

 

ఒకవేళ బీజేపీ నిజంగానే బిల్లుకి మద్దతు ఇచ్చినా కూడా మంచిదే. టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నట్లు “తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది తామేనని” డంకా భజాయించి చెప్పుకొని మరీ ప్రజలని ఓట్లు అడగవచ్చును. ఇంకా చెప్పుకోదలిస్తే తాము బీజేపీ కొమ్ములు ఏవిధంగా వంచి తెలంగాణాకి మద్దతు ఇప్పించిందీ కధలు కధలుగా చెప్పుకొని ఓట్లు నొల్లుకోవచ్చును.

 

అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రదర్శిస్తున్న ఈ అతి నిజాయితీ, నిబ్బదత అంతా కూడా ఒకవేళ బిల్లుని ఆమోదింపజేయలేకపోతే తాము వచ్చే ఎన్నికలలో సురక్షితంగా లేదా తక్కువ నష్టంతో బయటపడేందుకే తప్ప, తెలంగాణా ప్రజల పట్ల వెర్రి అభిమానంతో తెలంగాణా ఏర్పాటు చేసేయాలనే ఆలోచనతో మాత్రం కాదు.

By
en-us Political News

  
నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.
తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా..
ఆంధ్రప్రదేశ్ ఖనిజ మరియు గనుల సంపదకు సంబంధించిన తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, మీ రిక్వెస్ట్ మేరకు రూపొందించిన ప్రత్యేక వ్యాసం కింద ఇవ్వబడింది.
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది.
మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.