కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేనా?
Publish Date:Jan 3, 2013
Advertisement
కేంద్రం రాష్ట్ర విభజనపై తన నిర్ణయం ప్రకటించేందుకు నెలరోజుల గడువు ప్రకటించిన నాటినుండి రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది. మిగిలిన పార్టీలకన్నా కూడా ఎక్కువగా కాంగ్రేసు పార్టీలోనే తెలంగాణా అంశంపై రాద్దాంతం జరుగుతోంది. కాంగ్రేసులో కొందరు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తే లేదని గట్టిగా చెపుతుంటే, మరి కొందరు ఆవాదనలు బలపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలకి ఆందోళన చెందుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వారి మాటలు ఖండించలేకపోవడంతో, తెరాస వంటి పార్టీల ముందు చులకనయిపోతున్నారు. అందుకే, రేపు తెలంగాణా కాంగ్రెస్ నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకొన్నారు. సమైక్యంద్రవాదిగా పేరుపడిన లగడపాటి రాగోపాల్ ఈ రోజు విజయవాడలో పత్రికల వారితో మాట్లాడుతూ తెలుగు ప్రజలను, నేలను, నీటిని ఎవరూ కూడా విడదీయలేరన్నారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని, పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై తమకు స్పష్టమైన సంకేతాలు అందాయని తెలియజేస్తూ, తమకు అర్ధమయిన ఈ విషయం, ఇతరులకి ఎందుకు అర్థం కాలేదో తెలియదని అన్నారు. పూర్తీ విశ్వాసంతో చెపుతున్న అయన మాటలువిన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, హైదరాబాదులో మీడియా వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్ప తాము ఎలాంటి ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లకు అంగీకరించబోమని తెలిపారు. తద్వారా ఆయనకూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ఈయబోదని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు, రాష్ట్ర కేంద్ర మంత్రులు మాట్లాడిన తీరు చూసినట్లయితే కాంగ్రెస్ తెలంగాణాకి ప్రత్యెక ప్యాకేజి వంటిదేదో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది తప్ప, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పరిచే ఆలోచన ఉన్నట్లు కనిపించట్లేదు. ఇక, ఈ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెలాకరు వరకు వేచిచూడవలసిందే.
http://www.teluguone.com/news/content/congress-party-24-20187.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





