ఫిర్ ఏక్ బార్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ !

Publish Date:Aug 4, 2025

Advertisement

పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు  ఆపరేషన్ ఆకర్ష్  పై దృష్టిని కేంద్రీకరించిందా? అంటే  హస్తం పార్టీ  వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం  ఉచ్చు నుంచి తప్పించుకునేదుకు  అవసరమైన మేరకు మరింత మంది బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  అయితే, ప్రస్తుతానికి అది కూడా ఒక ఆప్షన్ గా మాత్రమే పార్టీ నాయకత్వం భావిస్తోందంటున్నారు.   పార్టీ ఫిరాయించిన పెద్దలను కాపాడేందుకు  అదొక్కటే మార్గం అని మాత్రం అనుకోవడం లేదని  అంటున్నారు.

అయితే..  ప్రస్తుత రాజీకీయ వాతావరణంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేంతటి  సాహసం చేస్తారా?  తెలంగాణ రాజకీయాల్లో అనిశ్చితి పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రస్తుత సమయంలో  తాత్కాలిక ప్రయోజనాల కోసం  ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాహసిస్తారా? అంటే రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. 

అదలా ఉంటే..  ప్రస్తుత లెక్కల ప్రకారం  బీఆర్ఎస్. శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకోవాలంటే మరో 16మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేయవలసి ఉంటుంది.  గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్  39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే.. 2024లో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్  సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మల్యే మాగంటి చనిపోవడంతో ఆ సీటు ఖాళీగా వుంది. ఇక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు.

అదలా ఉంటే, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ ఫిరయిస్తేనే  అనర్హత వేటు నుంచి తప్పించుకోగలరు. కాదంటే  వేటు పడుతుంది. ఆ లెక్కన, అనర్హత వేటు తప్పాలంటే, మరో 16 (మొత్తం 26) మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరవలసి ఉంటుదని అంటున్నారు.  

ఇప్పుడున్న పరిస్థితిలో ఒకేసారి 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే కాంగ్రెస్ నాయకులు అదెంత పని చిటికేస్తే పోలో మంటూ వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారని అంటున్నారు.  నిజానికి  సుప్రీం కోర్టు తీర్పు కోసం  కాంగ్రెస్ నాయకత్వం, ఆపరేషన్ ఆకర్ష్  కు చిన్న విరామం ఇచ్చిందే తప్ప  శాశ్వతంగా చుక్కపెట్టలేదని  అంటున్నారు. నిజానికి..  గతంలోనే పీసీసి అధ్యక్షుడు  మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ ఆకర్ష్ ఒక నిరంతర ప్రక్రియ.. ఎప్పుడూ ఆగదని చెప్పారు.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా పార్టీలోకి వస్తానంటే తీసుకుంటాం..  అందులో తప్పేముందని అన్నట్లు చెపుతున్నారు.

అయితే..  విశ్వసనీయ సమాచారం ప్రకారం,ఆపరేషన్ ఆకర్ష్ పునరుద్దరణకు సంబంధించి, కాంగ్రెస్ పెద్దలు ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు  ఉన్న న్యాయపరమైన ప్రత్యామ్నాయాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించి..  మరో మార్గం లేనప్పుడు మాత్రమే ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించాలని పార్టీ పెద్దలు అలోచిస్తున్నట్లు చెపుతు న్నారు.అయితే..  ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్  సిద్ధాంతాలు, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చి వస్తామంటే.. గాంధీ భవన్ తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని, పార్టీ పెద్దలు చెప్పడం కొసమెరుపు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.