కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ ఏదీ? ఒంటరిగా ఓడించలేమంటూ చేతులెత్తేసిన హస్తం పార్టీ

Publish Date:Feb 27, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ, పూర్వ వైభవం పై ఆశలు వదిలేసుకుందా? పునర్జ్జీవనం పొందితే చాలానే దశకు చేరుకుందా? అధికారమే పరామావధి అనే ఆలోచనకు వచ్చిందా? సంకీర్ణ సారథ్యం దక్కితే చాలు అనుకుంటోందా?  అంటే, పాత తరం కాంగ్రెస్ పెద్దలు, రాజకీయ  విశ్లేషకులు అవుననే అంటున్నారు. 

ఛత్తీస్ గఢ్ రాజధని నయా రాయ్ పూర్ లో జరిగిన పార్టీ  మూడు రోజుల ప్లీనరీ సమావేశాలలో పసంగించిన పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, 2004 నుంచి 2014 వరకు సాగిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సంకీర్ణ పాలన దగ్గరే ఆగిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవ స్థితికి ప్రామాణికం అన్నట్లుగా, మళ్ళీ మనం మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, బీజీపీ యేతర పార్టీలను కలుపుకుని ముందుకు పోదాం అని, సోనియా పిలుపు నిచ్చారు. అలాగే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ ప్రారంభ ఉపన్యాసంలోనే...  సంకీర్ణ ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు. 

అలాగే,  రాయపూర్‌ డిక్లరేషన్‌  లోనూ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది.  తెలంగాణ, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో కలిసి మెలిసి పనిచేయాలి. తప్పనిసరిగా పార్టీని గెలిపించాలి. 2024లో జరగనున్న కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ఈ విజయాలే ప్రాతిపదిక  అని డిక్లరేషన్‌ పేర్కొంది. 

అయితే మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ విధానం ఇదేనా అంటే, కాదని అంటున్నారు, పాతతరానికి చెందిన సీనియర్ నాయకులు.  నిజానికి 2014 ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు భావసారుప్యత పేరిట అనేక పార్టీలను వివిధ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతగా ప్రణబ్ ముఖర్జీ కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణాలకు ఒడిగట్టడం అసలు గుర్తింపునకే ముసురు తెస్తుందని చేసిన సూచన ఇప్పటికీ అలోచింపచేసేదిలా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

1996-2012 మధ్యకాలంలో సాగిన సంకీర్ణ ప్రభుత్వాలపై రాసిన ఓ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అనేక అంశాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంకీర్ణ ప్రభుత్వాలపై తన ఆలోచన మారలేదన్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీని  ఓడించేందుకు వివిధ పార్టీలతో చేతులు కలపాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలతో తాను ఏకీభవించలేదన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేయడమే సరైన మార్గమని, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పదిలపరచుకోగలుగుతుందని ఉద్ఘాటించారు. బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక వాద పార్టీలతో చేతులు కలపాలంటూ 2003లో సిమ్లాలో జరిగిన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ప్రణబ్  అది అంతకుముందు జరిగిన పంచమడి తీర్మానానికి విరుద్ధం. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంకీర్ణ కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆ సదస్సులో మేము తీర్మానించాం అని గుర్తు చేశారు.

సిమ్లా సదస్సులో అందరి అభిప్రాయాలను సేకరించారని, పంచమడి తీర్మానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సోనియా, మన్మోహన్ సహా అందరూ మొగ్గు చూపారని ప్రణబ్ తెలిపారు. కానీ తానొక్కడినే అందుకు భిన్నంగా మాట్లాడానని, ఇతర పార్టీలతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని విస్పష్టంగా తెలియజేశానన్నారు. ప్రత్యేకంగా 2004 సంవత్సరానికి సంబంధించి ఈ పుస్తకంలో అనేక ఆసక్తిరమైన అంశాల్ని ముఖర్జీ ప్రస్తావించారు. ‘ది ఇందిరా ఇయర్స్’, ‘ది టర్బ్యులెంట్ ఇయర్స్’ పేరుతో ఇప్పటివరకూ ప్రణబ్ రెండు పుస్తకాలు వెలువరించారు. సంకీర్ణ శకానికి సంబంధించిన అంశాలపై తన మూడో పుస్తకాన్ని వెలువరించారు. అధికార పీఠాన్ని ఎక్కాలన్న పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోకూడదన్నది తన నిశ్చితాభిప్రాయమని పేర్కొన్న ప్రణబ్  ప్రతిపక్షంలో కూర్చున్నా తప్పులేదు కానీ.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ తన ఉనికిని మాత్రం కోల్పోకూడదు  అని ఉద్ఘాటించారు.

 అయితే ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేరు. ఆయన స్థాయి నాయకులూ లేరు. అదీ గాక  అవునన్నా కాదన్నా, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఎదుర్కునే పరిస్థితిలో లేదు.  అంతే  బీజేపీయేతర పార్టీలలో సగానికి పైగా పార్టీలు, కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు కూడా సుముఖంగా లేరు...  మరో వంక థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగ్తున్నాయి .. ఈ పరిస్థితిలో  రాయపూర్‌ డిక్లరేషన్  వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.