చిత్తశుద్ధి లేని చింతన్ శిబిరాలు.. దార్శనికత కరవైన కాంగ్రెస్ అధినాయకత్వం!

Publish Date:May 14, 2022

Advertisement

కాంగ్రెస్‌ పార్టీ చింతన శివిర్ లో దేశానికి రాజకీయంగా ప్రత్యమ్నాయశక్తిగా ఎలా అవతరించాలో..ప్రజలకు అండగా ఉండడానికి..వారిలో నమ్మిక కలిగించడానికి ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలో చర్చ జరగాలి. గతంలో చేసిన తప్పిదాలను అంగీకరించి, వాటిని పునరావృతం కానివ్వబోమన్న సందేశాన్ని పార్టీ క్యాడర్ కే కాదు.. దేశ ప్రజలకు కూడా ఇవ్వగలగాలి. దేశానికి దిశ దశను చూపే దార్శనికతను ప్రదర్శించాలి. అది మాని కేవలం అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు సంధిస్తే సరిపోదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో కేవలం విమర్శలకే పరిమితమయ్యారు.  

బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపొందించి జనంలోకి తీసుకువెళ్లగలిగిన నేతలు కాంగ్రెస్ లో కరవయ్యారు. విచిత్ర మేమంటే కాంగ్రెస్‌ పార్టీ తాను ఏమిచేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది.  గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడిని ప్రతిపాదించే సాహసం పార్టీ అగ్రనాయకత్వంతో సహా ఎవరూ చేయలేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. దేశ సమస్యలను ఆకళింపు చేసుకుని, వాటి పరిష్కారానికి మార్గాలను సూచించగలిగే సమర్థత గల నాయకత్వం కాంగ్రెస్ కు కొరవడింది.  చింతన్ శిబిర్ లో అది ప్రస్ఫుటంగా గోచరించింది. వారసత్వ బలహీనత లనుంచీ, వంధిమాగధ గణం నుంచీ, కోటరీల  స్వార్థ  నేతలనుంచీ,  వెన్ను పొట్ల  సంస్కృతి నుంచీ,   దళారులనుంచీ కాంగ్రెస్‌ తనను తాను బయటపడేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ మార్పు లేని జడత్వంలో కూరుకుపోతున్నది. దీంతో సమకాలీన రాజకీయాలలో ఉనికిని వేగంగా కోల్పోతోంది.

ఈ బలహీనతలను పూర్తిగా వదిలించుకుని, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ తనను తాను మరల్చుకోవలసిన అవసరం ఉంది. అయితే చింతన్ శిబిర్ లో నేతల ప్రసంగాలూ, పోకడలూ చూశాకా.. ఇప్పటికీ కాంగ్రెస్ పాత పద్ధతులను విడడానికి సిద్ధంగా లేదనీ, లోపాలను గుర్తించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ససేమిరా అంటోందని అవగతమౌతుంది. దేశంలో  ధరలు, నిరుద్యోగం, పెట్రో, గ్యాస్‌ ధరల పెంపు, జిఎస్టీ వాయింపులు, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించి.. వీటిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌  ఏం చేస్తుందన్న ప్రణాళికలను ప్రజలకు వివరించాలి. అలాగే  దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఏం చేయబోతోందో చెప్పగలగాలి.   వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ, తనయ ప్రియాంకాగాంధీతో సహా హేమాహేవిూలందరూ చింతన్‌ శిబిర్ లో పాల్గొన్నారు.  

అయిదు రాష్టాల ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్‌ నిజంగానే దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఇది తల్లీ కూతుళ్లకు, తల్లీ తనయులకు తెలియనివి కావు. పార్టీ అధిష్ఠానం ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ సంబంధాలు కోల్పోయింది.  ఇప్పటికే కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో బిజెపితో రెండు యుద్దాలు చేసి ఓడి పోయింది. పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఎన్నికలోనూ పార్టీ దెబ్బతింటూ వస్తోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది.

ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించే పరిస్థితులు ఉన్నప్పటికీ గెలిపించగల నాయకత్వం లేదని రుజువు చేసుకుంది. పంజాబ్‌లో ఆఖరి రోజుల్లో ముఖ్యమంత్రిని తొలగించి, ఆచరణ సాధ్యం కాని ప్రయోగాలు చేసి కుప్పకూలిపోయింది.  ఇప్పటికీ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు చిత్తశుద్ధితో అధిష్ఠానం ప్రయత్నించడం లేదని చింతన్ శిబిర్ లో నేతల ప్రసంగాలు రుజువు చేశాయి. బీజేపీని సమర్థంగా ఢీ కొకొనాలంటే కాంగ్రెస్ లేని కూటమి వల్ల సాధ్యం కాదని అందరూ నమ్ముతారు. అదే సమయంలో నమ్మి కాంగ్రెస్ తో కలిసే ధైర్యం మాత్రం ఏ పార్టీ చేయడం లేదు. ఒకప్పుడు రాజకీయ పార్టీలు బీజేపీని దూరంగా పెట్టేవి..ఇప్పుడా పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చిందా అనిపిస్తున్నది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించి పార్టీ ప్రక్షాళన విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.